ఆ హీరో కుమార్తె పెళ్ళికి హాజ‌రైన‌ ప్రధాని నరేంద్ర మోదీ

మలయాళం నటుడు సురేష్ గోపి కుమార్తె భాగ్య సురేశ్ వివాహంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

By Medi Samrat
Published on : 17 Jan 2024 4:34 PM IST

ఆ హీరో కుమార్తె పెళ్ళికి హాజ‌రైన‌ ప్రధాని నరేంద్ర మోదీ

మలయాళం నటుడు సురేష్ గోపి కుమార్తె భాగ్య సురేశ్ వివాహంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గురువాయూరు క్షేత్రంలో భాగ్య సురేశ్‌ వివాహ వేడుకకు ప్రధాని మోదీ అతిథిగా హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకలకు మోహన్‌లాల్, మమ్ముట్టి జ‌య‌రామ్, ఖుష్బు, షాజీ కైలాస్, జయరామ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

సురేశ్‌ గోపీ కూతురు భాగ్య సురేశ్‌, శ్రేయాస్‌ మోహన్‌ను వివాహం చేసుకుంది. వీరి వివాహం జనవరి 17 ఉదయం కేరళలోని గురువాయూర్‌ ఆలయంలో చాలా సింపుల్‌గా జరిగింది. ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో వేడుకగా జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి ప్రధాన నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోదీ తన చేతుల మీదుగా నూతన వధూవరులు పూలదండలు మార్చుకునే కార్యక్రమాన్ని జరిపించారు. ఆ జంట మోదీ పాదాలకు నమస్కరించింది. వీరితో పాటు అదే ఆలయంలో పెళ్లి చేసుకున్న మరో 30 కొత్త జంటలను మోదీ ఆశీర్వదించారు.

Next Story