కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకునే వ్యక్తులకు కొత్త మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) జారీ చేసిన కొత్త ఆదేశం ప్రకారం.. COVID-19 పాజిటివ్ పరీక్షించినట్లయితే, వ్యాక్సిన్ తీసుకోవడాన్ని వాయిదా వేయాలి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి వికాష్ శీల్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో వ్యక్తులు ల్యాబ్ పరీక్షలో SARS-2 COVID-19 పాజిటివ్ అని రుజువైనట్లయితే బూస్టర్ డోస్ తో సహా అన్ని టీకాలను.. కోలుకున్న 3 నెలల తర్వాత వేయించుకోవాలని అన్నారు.
కోలుకున్న మూడు నెలల తర్వాత ప్రికాషన్ డోసుతో పాటు బూస్టర్, ఇతర కరోనా వ్యాక్సిన్లను అందించాలని కేంద్రం తెలిపింది. కోవిడ్ అనారోగ్యంతో బాధపడుతున్న అర్హులైన వ్యక్తులకు ప్రికాషన్ డోసు అందించే విషయంపై మార్గ నిర్దేశాల గురించి వివిధ వర్గాల నుండి అభ్యర్థనలు వచ్చాయని తెలిపారు. వ్యక్తులకు ల్యాబ్ పరీక్షలో కోవిడ్ ఉన్నట్లు తేలితే.. కోలుకున్న మూడు నెలల తర్వాతే ప్రికాషన్ డోసుతో సహా అన్ని కోవిడ్ వ్యాక్సిన్లను అందించాలని వికాష్ శీల్ లేఖలో తెలిపారు. ఇటువంటి మార్గదర్శకత్వం శాస్త్రీయ ఆధారాలు, NTAGI సిఫార్సుపై ఆధారపడి ఉంటుందని లేఖలో ఉంది.