ఎన్నికల సమయంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు షాక్
Pinarayi 'involvement' in dollar smuggling case shocking. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు ఊహించని షాక్ తగిలింది.
By Medi Samrat Published on 5 March 2021 1:03 PM GMT
కేరళ రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉంది. ఇలాంటి సమయంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు ఊహించని షాక్ తగిలింది. బంగారం అక్రమ రవాణా (స్మగ్లింగ్) కేసులో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు సంబంధముందని కస్టమ్స్ పేర్కొంది. ఆయనతో పాటు అసెంబ్లీ స్పీకర్ పి. శ్రీరామకృష్ణన్, ముగ్గురు మంత్రులూ అందులో ఉన్నారని వెల్లడించింది. ముఖ్యమంత్రి విజయన్, యూఏఈ కాన్సూల్ జనరల్ కు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను కేసులో ప్రధాన నిందితురాలైన స్వప్న సురేశ్ వెల్లడించిందని కౌంటర్ లో పేర్కొన్నారు.
వారిద్దరి మధ్య జరిగిన అక్రమ లావాదేవీలనూ చెప్పిందన్నారు. ఈ విషయానికి సంబంధించి సీఎం, ఆయన ప్రధాన కార్యదర్శి, వ్యక్తిగత సహాయ సిబ్బందితో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పిందన్నారు. సీఎం, స్పీకర్ ఆదేశాలతో ఆ అక్రమ విదేశీ సొమ్మును ఎక్కడికి తీసుకుపోయేవారో కూడా తనకు తెలుసంటూ స్వప్న ఒప్పుకొందని కౌంటర్ లో సుమీత్ కుమార్ వెల్లడించారు. ఈ మొత్తం కేసుకు తానే ప్రత్యక్ష సాక్షినంటూ స్వప్న చెప్పిందని కస్టమ్స్ తెలిపింది.
యూఏఈ కాన్సూల్ జనరల్ అడ్రస్ తో నవంబర్ 2019 నుంచి జూన్ 2020 మధ్య జరిగిన 167 కిలోల బంగారం అక్రమ రవాణా కేసును కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు. గత ఏడాది జులైలో 30 కిలోల అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు 15 మందిని అరెస్ట్ చేయడం సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే..!