పూలన్ విగ్రహాల ప్రతిష్టాపన.. నిర్వాహకులకు షాక్ ఇచ్చిన పోలీసులు

Phoolan Devi statue seized in UP before installation. పూలన్‌దేవీ వర్థంతి సందర్భంగా విగ్రహం ప్రతిష్టించాలని అనుకున్న నిర్వాహకులకు

By Medi Samrat  Published on  26 July 2021 6:58 AM GMT
పూలన్ విగ్రహాల ప్రతిష్టాపన.. నిర్వాహకులకు షాక్ ఇచ్చిన పోలీసులు

పూలన్‌దేవీ వర్థంతి సందర్భంగా విగ్రహం ప్రతిష్టించాలని అనుకున్న నిర్వాహకులకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆ విగ్రహాన్ని కాస్తా సీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసేందుకు వచ్చిన బీహార్ మంత్రి ముకేశ్ సహానీని వారణాసి ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు. లోక్ సభ మాజీ ఎంపీకి చెందిన విగ్రహ ప్రతిష్టాపన కోసం ప్లాట్ ఫాం ఏర్పాటుచేశారని పోలీస్ సూపరింటెండెంట్ రామ్ బదన్ సింగ్ అన్నారు.ఈ కార్యక్రమం మొత్తాన్ని వికాస్‌సీల్ ఇన్సాన్ పార్టీ నిర్వహించింది. బీజేపీ కులతత్వ ఆలోచనతోనే ఇలా చేసిందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భదోహీ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆశిష్ కుమార్ మాట్లాడుతూ.. ఇది ఏర్పాటు చేయడానికి ఎటువంటి అనుమతి లేదు. పైగా గ్రామ సమాజ్ కు చెందిన స్థలంలో ఏర్పాటు చేయాలని భావించారని.. అందుకే మంత్రిని కూడా కార్యక్రమానికి వచ్చేందుకు అనుమతించలేదని చెప్పారు ఎస్పీ. ప్రతిష్టాపించడానికి తీసుకొచ్చిన విగ్రహాన్ని మళ్లీ అక్కడికే తరలించినట్లు చెప్పారు.

పూలన్ దేవి విగ్రహాలను ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రతిష్టించబోతున్నట్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వికాషీల్ ఇన్సాన్ పార్టీ (VIP) ప్రకటించింది. నిషాద్ సమాజాన్ని ఆకర్షించే చర్యలో భాగంగా జూలై 25న ఉత్తరప్రదేశ్‌లోని 18నిషాద్ ఆధిపత్య జిల్లాల్లో దివంగత డాకోయిట్ ఫూలన్ దేవి బంగారు విగ్రహాలను ఏర్పాటు చేయాలని భావించారు. 20వ మరణ వార్షికోత్సవం సందర్భంగా మొత్తం 18 జిల్లాల్లో వేడుకలు నిర్వహించి విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు VIP చీఫ్ ముఖేష్ సాహ్ని ఇంతకు ముందు ప్రకటించారు. ఈ విగ్రహాలను వారణాసితో పాటు లక్నో, బల్లియా, సంత్ కబీర్ నగర్, బండా, అయోధ్య, సుల్తాన్‌పూర్, గోరఖ్‌పూర్, మహారాజ్‌గంజ్, ప్రయాగ్రాజ్, ఉన్నవో, మీరట్, మిర్జాపూర్, సంత్, మువిజార్‌లలో ఏర్పాటు చెయ్యాలని అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది వీలు పడేలా కనిపించలేదు.


Next Story
Share it