మ‌ళ్లీ పెరిగిన ఇంధ‌న ధ‌ర‌లు.. మిడిల్ క్లాస్ కు చుక్కలే..

Petrol Prices Hike. పెట్రోల్-డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 95 రూపాయలను

By Medi Samrat  Published on  7 Jun 2021 4:20 AM GMT
మ‌ళ్లీ పెరిగిన ఇంధ‌న ధ‌ర‌లు.. మిడిల్ క్లాస్ కు చుక్కలే..

పెట్రోల్-డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 95 రూపాయలను దాటేసింది. జూన్ 7న పెట్రోల్-డీజిల్ ధరలు లీటర్ కు 27, 28 పైసలు చొప్పున ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో సోమవారం నాడు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 95.37 కాగా.. డీజిల్ ధర 86.28 రూపాయలుగా నిర్ణయించారు. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.52, డీజిల్ రూ.93.58కు పెరిగింది. కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.95.28, డీజిల్ రూ.89.0, చెన్నైలో పెట్రోల్ రూ. 96.71, డీజిల్ రూ.89.07, లక్నోలో పెట్రోల్ రూ.92.56, డీజిల్ రూ.86.62, జైపూర్‌లో పెట్రోల్ రూ.101.88, డీజిల్ రూ.95.81, నోయిడాలో పెట్రోల్ రూ.92.67, డీజిల్‌ రూ.86.70 కు చేరింది. బెంగళూరులో పెట్రోల్‌ రూ.98.49, డీజిల్ రూ.91.41, భోపాల్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.103.45, డీజిల్ రూ.94.79కు చేరింది.

హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.99.05, డీజిల్‌ రూ.94కు చేరింది. గత నెలలో ఎన్నికల ఫలితాలు వెలువడిన నుంచి ఇప్పటి వరకు 20 సార్లు ధరలు పైకి కదిలాయి. పలు రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.వంద దాటింది. దేశంలో అత్యంత గరిష్ఠ స్థాయికి రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ జిల్లాలో లీటర్‌ పెట్రోల్‌ రూ.105 దాటింది. డీజిల్‌ ధర సైతం వందకు చేరువైంది. ప్రస్తుతం డీజిల్ లీట‌ర్‌ ధర రూ.98 పలుకుతోంది. మే 4వ తేదీ తర్వాత ఇంధన ధరలు పెంచడం ఇది 21వ సారి. పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న సమయంలో ప్రభుత్వం ఇంధన ధరలను పెంచకుండా ఉంది. ఇప్పుడు వరుసగా మిడిల్ క్లాస్ కు చుక్కలు చూపిస్తూనే ఉంది ప్రభుత్వం.


Next Story