జార్ఖండ్ రాష్ట్రంలో పెట్రోల్ ధరలను రూ.25 తగ్గిస్తున్నట్లు సీఎం హేమంత్ సోరెన్ బుధవారం ప్రకటించారు. పెట్రోల్ ధరలలో ఈ ఉపశమనం రాష్ట్రంలోని ద్విచక్ర వాహనదారులు మాత్రమే పొందగలరట. పెట్రోలు, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి, దీని కారణంగా పేద మరియు మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ద్విచక్ర వాహనాలకు పెట్రోల్‌పై లీటరుకు ₹ 25 ఉపశమనం ఇస్తుంది, దాని ప్రయోజనం 26 జనవరి 2022 నుండి ప్రారంభమవుతుందని జార్ఖండ్ CMO ట్వీట్ చేసింది.
పెట్రో ధరల తగ్గింపు పేదలకు లేదా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి ప్రత్యేకంగా వర్తిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. పెరుగుతున్న పెట్రో ధరలు మధ్యతరగతి, పేదలపై ప్రభావం చూపుతున్నాయని.. రాష్ట్రంలో పెట్రో ధరల కారణంగా పేద ప్రజలు తమ మోటార్‌సైకిల్‌ను నడపలేకపోతున్నారని సీఎం అన్నారు. ద్విచక్ర వాహనంలో నింపిన ప్రతి లీటరుకు 25 రూపాయల నగదు ప్రజల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడుతుంది. 10 లీటర్ల పెట్రోల్ కోసం ఈ సదుపాయాన్ని పొందవచ్చు. జనవరి 26 నుంచి జార్ఖండ్‌లో ఈ నిబంధన వర్తిస్తుంది. మరిన్ని నిబంధనల గురించి ప్రభుత్వం త్వరలోనే వివరణ ఇవ్వనుంది.