ఆగేదే లేదు.. మరోసారి పెరిగిన పెట్రోల్‌ ధరలు.!

Petrol and diesel rate rised again. చమరు ధరలు మంట పుట్టిస్తున్నాయి. తాజాగా మరోసారి చమురు కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచాయి. ఇవాళ లీటర్‌ పెట్రోల్‌పై

By అంజి  Published on  30 Oct 2021 8:01 AM IST
ఆగేదే లేదు.. మరోసారి పెరిగిన పెట్రోల్‌ ధరలు.!

చమరు ధరలు మంట పుట్టిస్తున్నాయి. తాజాగా మరోసారి చమురు కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచాయి. ఇవాళ లీటర్‌ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు చొప్పున పెంచారు. ఇంధన ధరల విషయమై సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నా.. ప్రభుత్వాలు మాత్రం ఎలాంటి చర్యలకు తీసుకోవడం లేదు. పెరిగిన ధరలతో తెలంగాణ క్యాపిటల్‌ సిటీ హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.113.36, డీజిల్‌ ధర రూ.106.30కు లభిస్తోంది. వరంగల్ నగరంలో లీటర్‌ పెట్రోల్‌ రూ.112.54, డీజిల్‌ రూ.105.78కి చేరుకుంది. కరీంనగర్‌లో లీటర్‌ పెట్రోల్ రూ.112.95, డీజిల్‌ ధర రూ.106.17కి లభిస్తోంది. నిజామాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.114.46, డీజిల్‌ ధర రూ.107.58గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన ఇంధన ధరలతో గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రేటు రూ.115.27, డీజిల్‌ రేటు రూ.107.86గా ఉంది. విశాఖపట్టణంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.114.57, డీజిల్‌ ధర రూ.107.57కి చేరుకుంది. కర్నూలులో లీటర్‌ పెట్రోల్‌ రూ.115.06, డీజిల్‌ రూ.107.66కి లభిస్తోంది.

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.86, డీజిల్ ధర రూ.97.37

ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.114.47, డీజిల్ ధర రూ. 105.47

చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.43, డీజిల్ ధర రూ. 101.59

బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.112.43, డీజిల్ ధర 103.35

కోల‌్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.12, డీజిల్ ధర రూ.100.49

రాజస్థాన్‌ రాష్ట్రంలోని గంగానగర్‌లో పెట్రోల్‌ రేటు అత్యధికంగా ఉంది. గంగానగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.120.37, లీటర్‌ డీజిల్‌ ధర రూ.111.30గా ఉంది.

Next Story