పెట్రో ధరలు పెంపు ఆగడం లేదు. గత కొన్ని రోజులుగా బ్రేకుల్లేకుండా పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచుతున్నారు. రోజు ఇంధన ధరలు పెరుగుతుండడంతో.. వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురువుతున్నారు. ధరల పెంపు ఇలాగే కొనసాగితే. వాహనదారులు, సామాన్యుల పరిస్థితి ఆగమ్యగోచరమవుతుంది. తాజాగా దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశంలో పెట్రోల్, డీజిల్‌పై తొలిసారిగా 40 పైసలకు పైగా పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ పై 41 పైసలు, డీజిల్ పై 42 పైసలు పెరిగింది.
దీంతో లీటర్ పెట్రోల్ రూ.114.13, లీటర్ డీజిల్ రూ.107.40కి హైదరాబాద్‌లో లభిస్తోంది. కోల్ కతాలో లీటర్ పెట్రోల్ రూ.110.15, డీజిల్ రూ.101.56కు లభిస్తోంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.109.69 డీజిల్ రూ.98.42కు దొరుకుతోంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.115.50, డీజిల్ రూ.106.62కు చేరుకుంది. చెన్నై లో లీటర్ పెట్రోల్ రూ.106.35, డీజిల్ రూ.102.59కు పెరిగింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండడంతో దేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయని ఆయిల్ కంపెనీ సంస్థలు చెబుతున్నాయి. సెప్టెంబర్ నెలలో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 9 - 10 డాలర్లు పెరిగి.. 85 డాలర్లకు లభిస్తోంది.