విమానం ఇంధనం కన్నా.. పెట్రోల్, డీజిల్‌ ధరలే ఎక్కువ.. ఎంతంటే.!

Petrol and Diesel price more then airplane fuel price. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా పెరుగుతుండటంతో వాహనదారులకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌

By అంజి  Published on  18 Oct 2021 11:09 AM IST
విమానం ఇంధనం కన్నా.. పెట్రోల్, డీజిల్‌ ధరలే ఎక్కువ.. ఎంతంటే.!

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా పెరుగుతుండటంతో వాహనదారులకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌ పేరు చెప్పి పెట్రోల్, డీజిల్‌ ధరలను చమురు కంపెనీలు ఇష్టానుసారం పెంచేస్తున్నాయి. దేశంలో చమురు ధరల పెంపుకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అయితే ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం తమకేమి పట్టనట్లు వ్యవహారిస్తోంది. ఇటు సెంట్రల్‌ ట్యాక్స్‌, అటు స్టేట్‌ ట్యాక్స్‌లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడి నడ్డీ విరుస్తున్నాయి. హైదరాబాద్‌లో లీటర్‌ డీజిల్‌ ధర రూ.103.54, లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110.44కు చేరుకుంది. గడిచిన 21 రోజుల్లో 16 సార్లు పెట్రోల్‌ ధర, 19 సార్లు డీజిల్‌ ధరలు పెరిగాయి. పెట్రోల్‌, డీజిల్‌పై మొత్తంగా రూ.5 లు పెరిగింది.

అన్ని రాష్ట్రాల్లో కూడా పెట్రోల్ రేట్‌ రూ.100 దాటగా, 12 రాష్ట్రాలకుపైగా డీజిల్‌ రేటు రూ.100లు దాటింది. గంగానగర్‌లో అత్యధికంగా పెట్రోల్‌ ధర రూ.117.86కు చేరింది. ఇంకో విషయం ఏమిటంటే.. విమానంలో వాడే ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ కన్నా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎక్కువ. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110 ఉండగా, లీటర్‌ ఏవియేషన్‌ టర్బైన్ ఫ్యూయల్‌ ధర రూ.79 మాత్రమే. విమానం ఇంధనం కంటే.. పెట్రోల్‌ ధర 33 శాతం ఎక్కువగా ఉంది. ఇంధన ధరలు వరుసగా పెరుగుతుండడంతో సోషల్‌ మీడియాలో బీజేపీ ప్రభుత్వంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. కొందరైతే బైక్‌ కొనుక్కోవడం కన్నా.. చిన్న విమానం కొనుక్కుంటే తొందరగా వెళ్లొచ్చని, ఇంధనం ధర కూడా తక్కువని తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్‌ రేట్లను భరించలేమంటూ కేంద్ర ప్రభుత్వం వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story