కుక్క విసిగిస్తోంద‌ని.. న‌డి రోడ్డుపై లాక్కెళ్లాడు..

Pet dog tied to car, dragged down road. పెంపుడు జంతువుల ప‌ట్ల చాలా ద‌యగా ఉంటారు చాలా మంది.

By Medi Samrat  Published on  12 Dec 2020 7:02 AM GMT
కుక్క విసిగిస్తోంద‌ని.. న‌డి రోడ్డుపై లాక్కెళ్లాడు..

పెంపుడు జంతువుల ప‌ట్ల చాలా ద‌యగా ఉంటారు చాలా మంది. అయితే.. ఓ పెద్దాయ‌న జాలి, ద‌య అనేది లేకుండా క్రూరంగా ప్ర‌వ‌ర్తించాడు. త‌న పెంపుడు కుక్క‌ను కారుకు క‌ట్టేసి దారుణంగా న‌డిరోడ్డుపై లాక్కళ్లాడు. పాపాం ఆ మూగ‌జీవం బాధ‌తో విల‌విల‌లాడుతున్నా.. ప‌ట్టించుకోలేదు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఘ‌ట‌న కేర‌ళ రాష్ట్రంలో ఎర్నాకుళం జిల్లాలో జ‌రిగింది.

ఎర్నాకుళం జిల్లాలో యూసఫ్(62) అనే వృద్ధుడు నివ‌సిస్తున్నాడు. త‌న‌ను బాగా విసిగిస్తోంద‌ని త‌న పెంపుడు కుక్క‌ను వ‌దిలించుకోవాల‌ని అనుకున్నాడు. అంతే క్షణం ఆలోచించ‌కుండా.. కారు వెనుక బాగంలో కుక్క‌ను తాడుతో బంధించి లాక్కెళ్లిపోయాడు. వేగంగా వెలుతున్న కారుతో స‌మానంగా ప‌రిగెత్త‌లేక ఆ మూగ‌జీవం కింద‌ప‌డినా.. అలాగే లాక్కెళ్లాడు.

అదే సమయంలో అటుగా వెలుతున్న ఓ బైక‌ర్ దీనిని వీడియో తీశాడు. కారును ఆపి యూస‌ఫ్‌ను ప్ర‌శ్నించాడు. కొంత‌సేపు వాదించిన యూస‌ఫ్ చివ‌రికి.. కుక్క‌కు క‌ట్టిని తాడును విప్పేసి అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు. ఈ వ్య‌వ‌హారం పై స‌ద‌రు బైక‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కారు యజమాని యూసుఫ్ పై చెంగమండ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. జంతువుల క్రూరత్వాన్ని నిరోధించే..చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు న‌మోదు చేసి..నిందితుడిని అరెస్టు చేశారు. అనంత‌రం బెయిల్‌పై అత‌డు విడుద‌ల‌య్యాడ‌ని ఓ పోలీస్ అధికారి తెలిపారు. గాయపడిన కుక్కను ప్రభుత్వ పశువైద్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు.

ఈ దారుణం ప‌ట్ల నెటీజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. వీడు అస‌లు మ‌నిషేనా..? అని ఒక‌రు కామెంట్ చేయ‌గా.. ఆ సాదు జీవం స్థానంలో అత‌డిని క‌ట్టేస్తే తెలుస్తుంది ఆ బాధ అంటూ కామెంట్లు చేస్తున్నారు.



Next Story