16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ వేయించుకున్న తీరా కామత్

People Donate rs16 Crore Child Teera Kamat. తీరా కామత్‌.. 8 నుంచి 10వేల మందిలో ఒక్కరికి మాత్రమే వచ్చే వెన్నెముక కండరాల

By Medi Samrat  Published on  8 May 2021 11:44 AM GMT
16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ వేయించుకున్న తీరా కామత్

తీరా కామత్‌.. 8 నుంచి 10వేల మందిలో ఒక్కరికి మాత్రమే వచ్చే వెన్నెముక కండరాల సమస్య 'స్పైనల్‌ మస్య్కులర్‌ అట్రోఫీ' అనే జన్యుపరమైన లోపంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే..! ఆమెకు మంచి జరగాలని ఎంతో మంది ఆకాంక్షించారు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కానీ ఆమెను బ్రతికించుకోలేమని తల్లిదండ్రులైన మిహర్‌ కామత్‌, ప్రియాంక కామత్‌ లు తమ బాధను చెప్పుకొచ్చారు. ఆమె కోసం 'ఇంపాక్ట్‌ గురు' క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా ఆన్‌ లైన్‌ లో విరాళాల్ని సేకరించారు. చిన్నారికి ఒక్క ఇంజెక్షన్ వేయాల్సి ఉండగా.. ఆ ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్ల రూపాయలు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఆ డబ్బు కూడా సేకరించారు. 42 రోజుల్లో ప‍్రపంచ దేశాలకు చెందిన 2.6 లక్షల మంది విరాళంగా అందించడంతో ముంబై హిందుజా ఆస్పత్రి వైద్యులు అమెరికా నుంచి జోల్‌ జెస్‌ స్మా ఇంజక్షన్‌ తెప్పించారు.

బుధవారం నాడు తీరా కామత్‌ కు రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేశారు. ప్రస్తుతం పాప ఆరోగ్య పరస్థితి బాగుందని డాక్టర్లు వెల్లడించారు. 8 నుంచి 10వేలలో ఒక్కరికి మాత్రమే ఈ జన్యుపరమైన సమస్య వస్తుందని.. ఈ అనారోగ్యసమస్యను నయం చేయాలంటే భారీ ఎత్తున ఖర్చు చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పడంతో మిహర్‌, ప్రియాంకలు ఆన్‌ లైన్‌ ద్వారా సేకరించిన విరాళాలతో ఇంజక్షన్‌ తెప్పించారు. బుధవారమే ఆ ఇంజక్షన్‌ ను వేశారు.. ఆ ఇంజక్షన్‌ పాపపై బాగా పనిచేస్తోందని తెలియడంతో అందరూ ఆనందించారు.

తీరా కామత్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..! జోల్ జెన్ స్మా ఇంజక్షన్ విదేశాల్లో మాత్రమే దొరుకుతుండగా.. ఆ చిన్నారి కోసం దిగుమతి సుంకం, జీఎస్టీని రద్దు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు.


Next Story
Share it