ఫాస్టాగ్ ఆధారిత పార్కింగ్ సేవలు.. త్వరలో పేటీఎం కరో..!

Paytm to launch FASTag-based parking service. పాత నోట్ల రద్దు తర్వాత.. దేశంలో డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత పెరిగింది.

By అంజి  Published on  14 Sep 2021 5:17 AM GMT
ఫాస్టాగ్ ఆధారిత పార్కింగ్ సేవలు.. త్వరలో పేటీఎం కరో..!

పాత నోట్ల రద్దు తర్వాత.. దేశంలో డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత పెరిగింది. రోజు వారి జీవనంలో సగటు భారతీయుడు డిజిటల్ లావాదేవీలకు మొగ్గుచూపుతున్నాడు. అయితే ఇదే సమయంలో డిజిటల్ చెల్లింపుల సంస్థలు సైతం కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా కొత్త కొత్త సేవలను ప్రారంభిస్తున్నాయి. తాజాగా ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం టోల్‌గేట్ల వద్ద ఫాస్టాగ్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ విధానాన్ని బేస్‌ చేసుకునే పార్కింగ్‌ స్థలాల్లో కార్లకు ఫాస్టాగ్ చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు పేటీఎం తెలిపింది.

ఇప్పటికే ఈ సేవలను ప్రయోగాత్మకంగా దేశ రాజధాని ఢిల్లీలోని మెట్రో పార్కింగ్‌ స్థలాల్లో పేటీఎం సంస్థ ప్రారంభించింది. బైక్‌లకు సైతం యూపీఐ ఆధారితంగా చెల్లింపులు చేసేందుకు వ్యవస్థను ప్రవేశపెట్టింది. అయితే ఈ కొత్త ఫాస్టాగ్‌ వ్యవస్థను దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు పేటీఎం సంస్థ ప్లానింగ్ చేస్తోంది. జూన్‌ 2021 నాటికి దేశవ్యాప్తంగా 3.47 కోట్ల ఫాస్టాగ్‌లను పేటీఎం సంస్థ జారీ చేసింది. అయితే ఈ వ్యవస్థను దేశ వ్యాప్తంగా ఆస్పత్రులు, షాపింగ్ మాళ్లు, ఎయిర్‌పోర్టుల్లో ప్రారంభించనున్నట్లు పేటీఎం వర్గాలు తెలిపాయి.


Next Story