మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న 13 సంస్థలకు సహాయం చేసేందుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. "ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మిషనరీస్ ఆఫ్ ఛారిటీ (ఎంఓసి)కి సహాయంగా రూ. 78.76 లక్షలు మంజూరు చేసినట్లు ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో పనిచేస్తున్న మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థల కోసం సీఎంవో ఈ సహాయం అందించింది.
ఈ నిర్ణయం వల్ల 900 కంటే ఎక్కువ లెప్రసీ, అనాథాశ్రమాలకు లబ్ది చేకూరుతుంది. ఈ మేరకు మదర్ థెరిసా ఏర్పాటు చేసిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇదిలావుంటే.. మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ఫారిన్ కంట్రిబ్యూషన్(FCRA) పునరుద్ధరణకు హోం మంత్రిత్వ శాఖ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ CMRF నిధులతో మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ద్వారా నిర్వహించబడుతున్న సంస్థలకు సహాయం చేశారు.