రైతులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తూ ఉన్నారుగా..!

Pashu Credit Card Scheme. రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వివిధ రకాల పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నాయి

By Medi Samrat  Published on  9 May 2022 7:34 AM GMT
రైతులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తూ ఉన్నారుగా..!

రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వివిధ రకాల పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నాయి. హర్యానా ప్రభుత్వం తాజాగా రైతుల కోసం క్రెడిట్ కార్డులను తీసుకుని వచ్చింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి బగవానీ బీమా యోజన, పసల్‌ క్రెడిట్ కార్డ్ పథకాలను ప్రారంభించింది. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి జైప్రకాష్ దలాల్ చర్కి-దాద్రీలోని చందవాస్ గ్రామంలో పశుపోషణ కోసం రైతులకు సర్వ హర్యానా గ్రామీణ బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 12 గ్రామాలకు చెందిన 325 మంది రైతులకు సుమారు ఐదు కోట్లతో వ్యవసాయం, పశుసంవర్ధక రుణం కార్డులను మంత్రి అందజేశారు. రైతులకు రూ.3 లక్షల వరకు రుణాలు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.

సకాలంలో రుణం చెల్లించే రైతులకు వడ్డీపై సబ్సిడీ కూడా ఉంటుందని, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఈ కార్డుపై రూ.1.60 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. ముఖ్యమంత్రి అంత్యోదయ పరివార్ ఉత్థాన్ యోజన కింద పీకేసీసీ కార్డు పనికొస్తుంది. రైతుల అభ్యున్నతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ పెద్దపీట వేశారని నాయకులు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ ద్వారా PM కిసాన్ లబ్దిదారులందరికి రుణ సదుపాయం కల్పించడానికి 'కిసాన్ క్రెడిట్ కార్డ్' లను జారీ చేయవలసినదిగా బ్యాంకులను ఆదేశించిన సంగతి తెలిసిందే..! పీఎం కిసాన్ లబ్ది దారులందరు సంబంధిత బ్యాంక్ శాఖల ద్వారా 'కిసాన్ క్రెడిట్ కార్డ్'లు పొందడానికి దరఖాస్తు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని బ్యాంకుల వారు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక కౌంటర్ ద్వారా.. పీఎం కిసాన్ లబ్ధిదారులకు వారి దరఖాస్తులను స్వీకరించిన 14 రోజుల్లో 'కిసాన్ క్రెడిట్ కార్డ్' లను అందజేయాల్సి ఉంటుంది.










Next Story