పశ్చిమ బెంగాల్‌లో ఉద్యోగ నియామకాల స్కామ్ దర్యాప్తులో భాగంగా నటి అర్పిత ముఖర్జీ పలు ఆసక్తి కర విషయాలు వెల్లడించారు. విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ తనకు 2016 నుంచి పరిచయం ఉన్నట్లు ఆమె చెప్పారు. ఒక బెంగాలీ నటుడు తనను మంత్రికి పరిచయం చేశారని చెప్పుకొచ్చారు.
పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ.. మంత్రి తన ఇంటిని మినీ బ్యాంక్‌గా ఉపయోగించుకున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి బహిర్గతం చేసింది. అర్పిత లాయర్లు తదుపరి విచారణలో కోర్టులో ఈడీ మూలాల వాదనలను తిరస్కరించే అవకాశం ఉంది. దర్యాప్తు వివరాలను మీడియాకు లీక్ చేసినందుకు ఏజెన్సీని నిందించారు. నైరుతి కోల్‌కతాలోని అతని అపార్ట్‌మెంట్‌లో ఆభరణాలు, విదేశీ కరెన్సీ లభించడంతో పాటు ₹20 కోట్లకు పైగా నగదు లభించింది. మంత్రి, అతని సహచరులని ED అరెస్టు చేసింది. అర్పిత ఇంటి నుండి స్వాధీనం చేసుకున్న కరెన్సీ నోట్ల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తన ఇంట్లో దొరికిన రూ. 21 కోట్ల రూపాయల డబ్బు పార్థా ఛటర్జీదే అని ఆమె చెప్పుకొచ్చింది. ఆ డబ్బుకు పార్థా మనుషులే సెక్యూరిటీగా ఉండేవారని.. వారు మాత్రమే ఆ రూమ్ లోకి వెళ్లి వచ్చే వారని అర్పిత తెలిపారు. తన ఇంట్లో ఒక రూమ్‌ను ఆయన మినీ బ్యాంకులా వాడుకున్నారని.. తనతో పాటు మరో మహిళ ఇంటిని కూడా ఆయన మినీ బ్యాంకులా వాడుకున్నట్లు అర్పిత చెప్పుకొచ్చింది.