నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు

By Medi Samrat
Published on : 5 Nov 2024 5:03 PM IST

నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగంతో సంప్రదాయ పద్ధతిలో సభ ప్రారంభం కానుంది. ఈ శీతాకాల సమావేశాలలో పార్లమెంటు ఉభయ సభలలో ప‌లు ముఖ్యమైన బిల్లులు చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. నివేదికల ప్రకారం.. 'ఒక దేశం ఒకే ఎన్నికలు' అంశంపై చర్చించే అవకాశం ఉంది. పార్లమెంటరీ ప్రాక్టీస్ ప్రకారం.. సభ సజావుగా జరిగేలా చూసేందుకు ప్రభుత్వం.. లోక్‌సభ స్పీకర్ పార్లమెంటు సమావేశానికి ముందు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది.

అంతకుముందు నవంబర్ 2న అందిన సమాచారం ప్రకారం, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 'వన్ నేషన్ వన్ ఎలక్షన్', వక్ఫ్ చట్టం సవరణ కోసం సమర్పించిన బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉంది. విపక్షాల దూకుడు వైఖరిని పరిశీలిస్తే రానున్న శీతాకాల సమావేశాలు గందరగోళంగా సాగే అవకాశం ఉంది. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలపడం గమనార్హం. ఇప్పుడు శీతాకాల సమావేశాల్లో బిల్లును ఆమోదించడంపై దృష్టి పెట్టనున్నారు.

Next Story