పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి.

By Knakam Karthik
Published on : 3 July 2025 7:41 AM IST

National News, Parliament, Monsoon Session, Bjp, Congress

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఇందుకు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించారు. ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదినకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల దృష్ట్యా ఆగస్టు 13,14 తేదీల్లో సమావేశాలు ఉండవు అని రిజిజు తెలిపారు.

అయితే ఈ సమావేశాలు ముందుగా ఆగస్టు 12తో ముగియనున్నట్లు పేర్కొన్నారు. కానీ ఇప్పుడు మరో వారం రోజుల పాటు పొడిగించారు. ప్రభుత్వం ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది. అందులో అణుశక్తి రంగంలో ప్రైవేటు సెక్టర్​ ప్రవేశాన్ని అనుమతించే చట్టాలు ఉన్నాయి. సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్, అటామిక్ ఎనర్జీ చట్టంలో సవరణలు చేయాలని అనుకుంటోంది. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ప్రకటనను అమలు చేయడానికే ఈ వారం రోజుల వ్యవధిని పొడిగించినట్లు తెలుస్తోంది.

మరో వైపు పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్‌పై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అటు భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్స్‌పై క్లారిటీ ఇవ్వాలని కోరాయి. ట్రంప్, ప్రధాని మోదీ మధ్య జరిగిన ఫోన్​ సంభాషణను కూడా తెలపాలని పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలోనే వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశం ఉంది.

Next Story