నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

Parliament Monsoon Session Begins Today. నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభ‌మ‌వ‌నున్నాయి.

By Medi Samrat  Published on  19 July 2021 3:43 AM GMT
నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభ‌మ‌వ‌నున్నాయి. సోమ‌వారం నుండి ప్రారంభ‌మ‌య్యే పార్లమెంటు సమావేశాలు ఆగస్టు 13 వరకు కొనసాగుతాయి. ఈ నేప‌థ్యంలో వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమ‌య్యాయి. విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకోంటొంది.

ఇక ఈ స‌మావేశాల్లో కొత్త కేబినెట్ మంత్రులను ప్రధాని మోదీ ఉభయసభల‌కు పరిచయం చేయనున్నారు. ఈ స‌మావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ముందుకు 31 అంశాలు తీసుకురానున్న‌ట్లు తెలుస్తోంది. 29 బిల్లులు, 2 ఆర్థిక అంశాలను కేంద్రం పార్లమెంటు ముందుకు తీసుకురానున్నది. అలాగే.. ఆరు ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులు ప్రవేశపెట్టనున్నది కేంద్రం.
Next Story