PAN-Aadhaar : పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు

PAN-Aadhaar linking deadline extended to June 30. పాన్-ఆధార్ లింక్ గడువు తేదీని జూన్ 30, 2023 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.

By Medi Samrat  Published on  28 March 2023 12:15 PM GMT
PAN-Aadhaar : పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు

PAN-Aadhaar linking deadline extended to June 30


పాన్-ఆధార్ లింక్ గడువు తేదీని జూన్ 30, 2023 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. లింక్ చేసుకోడానికి ఇంకొంతకాలం సమయం ఇచ్చేందుకు గడువు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం ఆధార్ నెంబర్‌ను 2023 మార్చి 31లోగా పాన్ కార్డుకు లింక్ చేయాలని తెలిపింది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఆధార్ నెంబర్ లింక్ చేయని పాన్ కార్డులు చెల్లవని హెచ్చరించింది. తాజాగా దానిని జూన్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

గడువు ముగిసేలోపు పాన్-ఆధార్ లింక్ చేయకపోతే.. పాన్ కార్డు డియాక్టివేట్ అవుతుంది. ఆ తరువాత ఆ కార్డును మీరు ఎక్కడా కూడా ఉపయోగించలేరు. ఇంకా ఆధార్ కార్డుతో పాన్ నంబరు లింక్ చేయకపోతే వెంటనే చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. మార్చి 31, 2022కి ముందు ఆధార్-పాన్ లింకింగ్ ఉచితం. ఏప్రిల్ 1, 2022 నుండి రూ. 500 రుసుము విధించారు. ఆ తర్వాత జూలై 1, 2022 నుండి రూ.1,000కి పెంచబడింది. పాన్-ఆధార్ లింక్ గడువును మరో ఆరు నెలలు పొడిగించాలని.. రూ. 1000 రుసుమును కూడా తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వెలువడింది.


Next Story