స‌రిహ‌ద్దులో డ్రోన్ క‌ల‌క‌లం.. కాల్పులు జ‌రిపి సోదాలు చేయ‌గా..

Pakistani drone spotted along International Border in Punjab's Ferozepur sector. అర్ధరాత్రి పంజాబ్‌లోని పాకిస్తాన్‌ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి డ్రోన్ కనిపించింది.

By Medi Samrat  Published on  10 Feb 2023 6:14 PM IST
స‌రిహ‌ద్దులో డ్రోన్ క‌ల‌క‌లం.. కాల్పులు జ‌రిపి సోదాలు చేయ‌గా..

అర్ధరాత్రి పంజాబ్‌లోని పాకిస్తాన్‌ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి డ్రోన్ కనిపించింది. పాకిస్థాన్ సరిహద్దు నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన డ్రోన్‌ పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లో కనిపించింది. వెంటనే అధికారులు డ్రోన్‌పై పలు రౌండ్లు కాల్పులు జరిపారు. BSF ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించిన తర్వాత సుమారు 3 కిలోల హెరాయిన్, 1 చైనా మేడ్ పిస్టల్, కాట్రిడ్జ్‌లు, ఒక మ్యాగజైన్‌తో కూడిన ప్యాకేజీని స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్‌ను ఉపయోగించి పాకిస్తాన్‌కు చెందిన డ్రగ్స్ స్మగ్లర్లు భారత్ లోకి రవాణా చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఒక అధికారి వార్తా సంస్థ ANIకి తెలిపారు.

గురువారం నాడు కూడా పంజాబ్ పోలీసులు స్మగ్లింగ్ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అమృత్‌సర్‌లో డ్రగ్ స్మగ్లర్‌ను అరెస్టు చేయడంతో పాటు రూ. 8.4 లక్షల విలువైన 15 కిలోల నిషిద్ధ హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి పారిపోయిన నిందితులను పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు.

Next Story