పాకిస్థాన్ ప్రపంచ పటంలో ఉండదు: అనురాగ్ ఠాకూర్

పాకిస్థాన్ తన వైఖరి మార్చుకోకుండా, భారత వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగిస్తే ఆ దేశాన్ని ప్రపంచ పటం నుంచే తుడిచిపెట్టేస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ హెచ్చరికలు జారీ చేశారు.

By Medi Samrat
Published on : 5 May 2025 8:30 PM IST

పాకిస్థాన్ ప్రపంచ పటంలో ఉండదు: అనురాగ్ ఠాకూర్

పాకిస్థాన్ తన వైఖరి మార్చుకోకుండా, భారత వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగిస్తే ఆ దేశాన్ని ప్రపంచ పటం నుంచే తుడిచిపెట్టేస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్థాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని పోషిస్తున్నందుకు పాకిస్థాన్‌పై భారత ప్రభుత్వం ఇప్పటికే పలు దౌత్యపరమైన చర్యలు తీసుకుందని అన్నారు. సరైన సమయంలో పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెబుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారన్నారు.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న పాకిస్తానీ పౌరులను గుర్తించి తిరిగి పంపించడంపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం సీరియస్‌గా లేదని విమర్శించారు ఠాకూర్. అమాయక పౌరుల త్యాగాన్ని వృధాగా పోనివ్వమని, వారి శరీరాల నుండి చిందిన ప్రతి రక్తపు బొట్టును ఉగ్రవాదులు, వారిని పోషించే వారి నుండి తీసుకుంటామని అన్నారు.

Next Story