భారత్‌పై పూర్తి స్థాయి మిలిటరీ ఆపరేషన్ చేపట్టినట్టు పాకిస్తాన్ ప్రకటించింది. ఇవాళ తెల్లవారుజామున ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆ దేశ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ భారత్‌పై వార్‌కు ఆపరేషన్ బన్‌యన్ ఉల్ మర్సూస్ అని పెట్టినట్టు వెల్లడించారు. దీంతో దాడులను ఆ దేశం మరింత తీవ్రతరం చేయనున్నట్టు తెలుస్తోంది. అటు పాకిస్తాన్‌లోని మూడు ఎయిర్‌బేస్‌లపై భారత్ దాడి చేసిందని ఆ దేశ మిలిటరీ వర్గాలు చెప్పినట్టు అంతర్జాతీయ మీడియా రాయిటర్స్ తెలిపింది. రావల్పిండిలోని నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌తో పాటు మురిద్, షార్‌కోట్ వైమానిక స్థావరాలపై భారత్ విరుచుకుపడినట్టు పేర్కొంది.
ఇటు భారత్‌లోని పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని పలు నగరాలపై పాకిస్తాన్ మిస్సైల్‌తో దాడులు చేస్తోందని రిపబ్లిక్ టీవీ వెల్లడించింది. తెలియని వ్యూహాత్మక లక్ష్యం వైపు దూసుకుపోతున్న ఫతా-1 క్షిపణిని పశ్చిమ సెక్టార్‌లో భారత వైమానిక రక్షణ దళాలు అడ్డుకుని ధ్వంసం చేశాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో ప్రభుత్వం ఉదయం 10 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనుంది. మే 10న, రావల్పిండి మరియు షోర్కోట్‌లోని వైమానిక స్థావరాలతో సహా పాకిస్తాన్ నగరాల్లో అనేక పేలుళ్లు సంభవించినట్లు నివేదించబడింది. భారత్ దాడితో తమ ఎయిర్‌స్పేస్‌ను పాక్ మూసేసింది.