సరిహద్దుల‌కు సైన్యాన్ని తరలిస్తున్న పాక్‌.. సిద్ధంగా ఉన్న భారత దళాలు

1999 కార్గిల్ యుద్ధం తర్వాత తొలిసారిగా సరిహద్దు వెంబడి ఉన్న ప్రాంతాలకు పాకిస్తాన్ తన సైన్యాన్ని తరలిస్తోందని భారత ప్రభుత్వం తెలిపింది. అయితే భారత దళాలు సిద్ధంగా, అప్రమత్తంగా ఉన్నాయని తెలిపింది.

By Medi Samrat
Published on : 10 May 2025 3:17 PM IST

సరిహద్దుల‌కు సైన్యాన్ని తరలిస్తున్న పాక్‌.. సిద్ధంగా ఉన్న భారత దళాలు

1999 కార్గిల్ యుద్ధం తర్వాత తొలిసారిగా సరిహద్దు వెంబడి ఉన్న ప్రాంతాలకు పాకిస్తాన్ తన సైన్యాన్ని తరలిస్తోందని భారత ప్రభుత్వం తెలిపింది. అయితే భారత దళాలు సిద్ధంగా, అప్రమత్తంగా ఉన్నాయని తెలిపింది. పాకిస్తాన్ నాలుగు రాష్ట్రాలలోని 26 సైనిక స్థావరాలను, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్న తర్వాత శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. భారతదేశం ఆరు పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహించిందని ప్రభుత్వం తెలిపింది.

వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. దళాలను సమీకరించాలనే పాకిస్తాన్ నిర్ణయం భారతదేశంపై దాడి చేయాలనే ఉద్దేశాన్ని సూచిస్తుందని అన్నారు. "పాకిస్తాన్ సైన్యం సరిహద్దు ప్రాంతాలకు తమ దళాలను తరలిస్తున్నట్లు తెలుస్తోంది, ఇది పరిస్థితిని మరింత తీవ్రతరం చేయాలనే ఉద్దేశ్యాన్ని సూచిస్తుంది. అయితే, భారత సాయుధ దళాలు సంసిద్ధతలో ఉన్నాయి. అన్ని శత్రు చర్యలను సమర్థవంతంగా ఎదుర్కొని తగిన విధంగా స్పందిస్తాము" అని ఖురేషి అన్నారు.

Next Story