ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపిన మహిళా సిబ్బంది

Oxygen Express train piloted by female crew. దేశంలో కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరంగా మారింది. రోగులకు చికిత్సలో మందులతో

By Medi Samrat  Published on  22 May 2021 11:25 AM GMT
ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపిన మహిళా సిబ్బంది

దేశంలో కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరంగా మారింది. రోగులకు చికిత్సలో మందులతో పాటు ఆక్సిజన్‌ అత్యవసరం అయిపొయింది. రోగులు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతుడటంతో వారికి అప్పటికప్పుడు ప్రాణవాయువు అందించాల్సి వస్తోంది. అయితే అదే సమయంలో దేశవ్యాప్తంగా పలు చోట్ల ఆక్సిజన్ కొరత ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లను రాష్ట్రాలకు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది.

ప్రత్యేకంగా ప్రాణవాయువు తరలింపు కోసం ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ లు నడపటం ప్రారంభించింది. ఈ రైళ్లు వేగంగా గమ్యస్థానాలు చేరుకునేందుకు వీలుగా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసింది.ఇప్ప‌టికే ఆ రైళ్లు వేల మెట్రిక్ ట‌న్నుల లిక్విడ్‌ ఆక్సిజ‌న్‌ను స‌ర‌ఫ‌రా చేశాయి. తాజాగా జార్ఖండ్‌లోని టాటాన‌గ‌ర్ నుంచి ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ ఒక‌టి బెంగుళూరులోని వైట్‌ఫీల్డ్‌కు చేరుకున్న‌ది. అయితే ఆ రైలు స్పెషాలిటి ఏంటంటే అందులో మొత్తం మ‌హిళా సిబ్బందే ఉన్నారు. రైలు డ్రైవ‌ర్‌, అసిస్టెంట్ డ్రైవ‌ర్‌, గార్డ్ ఇలా అంద‌రూ మ‌హిళ ఉద్యోగులే. వైట్‌ఫీల్డ్‌కు చేరుకున్న ఆ రైలు మొత్తం 120 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్ తీసుకు వ‌చ్చింది. ఆరు బోగీల‌తో ఈ రైలు బెంగుళూరు చేరుకున్న‌ది. భార‌తీయ రైల్వే శాఖ ఇప్ప‌టి వ‌ర‌కు 13319 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను.. 814 ట్యాంక‌ర్ల‌లో.. 208 ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా స‌ర‌ఫ‌రా చేసింది. ఎంతోమందికి ఊపిరి అందించింది.


Next Story