ఢిల్లీలో అవసరమైన వారికి ఆక్సిజన్ డోర్ డెలివరీ

Oxygen Door Delivery In Delhi. కరోనా రాకాసి దేశంలో కరాళ నృత్యం చేస్తున్న వేళ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

By Medi Samrat  Published on  15 May 2021 2:02 PM GMT
ఢిల్లీలో అవసరమైన వారికి ఆక్సిజన్ డోర్ డెలివరీ

కరోనా రాకాసి దేశంలో కరాళ నృత్యం చేస్తున్న వేళ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పేషంట్ లు ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు ఇంటి వద్దకే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. సమర్థవంతమైన చికిత్స కోసం అవసరమైన రోగులకు ఆక్సిజన్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఉంచుతామన్నారు. మెడికల్ ఆక్సిజన్ అందుబాటులో లేక కోవిడ్ రోగులు ఐసీయు లో చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, అలాంటి సమయంలో బెడ్స్ దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అటువంటి సమస్యలను తొలగించేందుకే ఈ బ్యాంకులను ఏర్పాటు చేశామన్నారు.

హోమ్ ఐసోలేషన్లో ఉంటూ, ఆక్సిజన్ లెవెల్ తగ్గుతూ ఉన్నప్పుడు తమను సంప్రదిస్తే అవసరమైనవారికి వీటిని 2 గంటల వ్యవధిలో ఇంటి వద్దకు పంపిస్తామన్నారు. దీనిని ఎలా వినియోగించుకోవాలో బృందంలోని సభ్యులు నేర్పిస్తారన్నారు. అలాగే రోగులకు వైద్యులు సైతం అందుబాటులో ఉంటారని, అవసరాన్ని బట్టే హాస్పిటల్లో జాయిన్ చేసుకునేలా చర్యలు తీసుకుంటారని చెప్పారు.

ఈ సదుపాయాన్ని వినియోగించుకోవటం కోసం 1031 నెంబర్ కి కాల్ చేయాలని సూచించారు. ఒక్కోసారి హాస్పిటల్ నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొన్ని సందర్భాలలో ఆక్సిజన్ కావలసి ఉంటుందని అటువంటి వారికి కూడా ఈ బ్యాంకు ద్వారా ఆక్సిజన్ అందజేస్తామని చెప్పారు. ఢిల్లీలో కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయన్నకేజ్రీవాల్ ఇకపై ఢిల్లీలో మరోసారి కరోనా విజృంభించకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటాం అన్నారు.


Next Story