ఓటరు జాబితా నుంచి మీ పేరు తొలగిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉండదు
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఓటర్ల జాబితా పరిశీలన జరుగుతోంది.
By Medi Samrat
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఓటర్ల జాబితా పరిశీలన జరుగుతోంది. ఈ విషయంపై పెద్ద ఎత్తున రాజకీయాలు కూడా జరుగుతున్నాయి. ఎన్నికల సంఘం చర్యపై బీహార్ ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ అంశంపై రాష్ట్రీయ జనతాదళ్ ఎంపీ మనోజ్ ఝా తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది.
ఈ నేపథ్యంలో పాస్‌పోర్ట్‌లు, జనన ధృవీకరణ పత్రాలను తయారు చేసుకోవాలని ముస్లిం ప్రజలకు AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. ఓటరు జాబితా నుంచి మీ పేరు తొలగిస్తే ప్రధాని నరేంద్రమోదీ సంతోషిస్తారని అన్నారు. ఓటరు జాబితా నుంచి మీ పేరు తొలగిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉండదన్నారు.
తెలంగాణలోని గోదాన్‌లో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. మీరందరూ తప్పనిసరిగా బర్త్ సర్టిఫికెట్ తయారు చేసుకోవాలన్నారు. మీ దగ్గర పాస్‌పోర్ట్ లేకపోతే, దయచేసి నాకు చెప్పండి. బీహార్, తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఓటరు జాబితా వెరిఫికేషన్ జరుగుతుందన్నారు.
పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదని గతంలో ఒవైసీ అన్నారు. ఆ అధికారం హోం మంత్రిత్వ శాఖకు ఉంటుంది, SP బోర్డర్‌కు ఆ అధికారం ఉంది. ఆ తర్వాత ముగ్గురు అధికారులు సంతకాలు చేస్తారు. ఆ తర్వాత ఫారినర్స్ ట్రిబ్యునల్‌కి.. మీకు హక్కు లేదు.. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు.. ఇది మా ప్రాథమిక ప్రశ్న అని అడిగారు. ఇది బ్యాక్‌డోర్ ఎన్‌ఆర్‌సీగా మారకూడదని నేను ఇప్పటికే చెప్పానని ఒవైసీ అన్నారు.