80 మందికి పైగా పిల్లల్లో టొమాటో ఫ్లూ
Over 80 kids in Kerala reportedly infected. కొత్త ఫ్లూ పిల్లల తల్లిదండ్రులు, అధికారులను ఆందోళనకు గురిచేస్తూ ఉన్నాయి.
By Medi Samrat Published on 11 May 2022 8:30 PM ISTకొత్త ఫ్లూ పిల్లల తల్లిదండ్రులు, అధికారులను ఆందోళనకు గురిచేస్తూ ఉన్నాయి. మీడియా నివేదికల ప్రకారం, కేరళలో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 80 మందికి పైగా పిల్లలు వైరస్ బారిన పడ్డారు. వారి సంఖ్య ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు. కేరళలోని కొల్లామ్ లో టమోటా ఫ్లూ వ్యాప్తి జరగగా.. వాలాయర్ లో కూడా ఈ రకమైన ఫ్లూ లక్షణాలకు సంబంధించిన చర్చ జరుగుతూ ఉంది. జ్వరం, దద్దుర్లు, ఇతర అనారోగ్యాల బారిన పడినవారిని తమిళనాడులోని కోయంబత్తూర్‌లోకి ప్రవేశించే ముందు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇద్దరు వైద్య అధికారులు అన్ని వాహనాలలోని ప్రయాణీకులను, ముఖ్యంగా పిల్లలను పరిశీలిస్తున్నారని, అధికారిక వర్గాలు తెలిపాయి.
అంగన్‌వాడీల్లో ఐదేళ్లలోపు పిల్లలకు పరీక్ష చేసేందుకు 24 మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పిటిఐ వర్గాలు తెలిపాయి. కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. టమోటో ఫ్లూ కేసులు నమోదైన ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టింది. గ్రామాల్లో అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇది సోకిన పిల్లలకు జ్వరం వస్తుంది. ఇది సోకిన పిల్లల్లో దద్దుర్లు, చర్మం మీద చికాకు వంటి లక్షణాలను అనుభవిస్తారు. దీని వల్ల శరీరంలోని అనేక భాగాలపై బొబ్బలు ఏర్పడతాయి. బొబ్బల ఆకారం సాధారణంగా ఎరుపు రంగులో ఉంటుంది, కాబట్టి దీనిని టొమాటో ఫ్లూ-టొమాటో జ్వరం అంటారు.