ఈ పాప అలవాటు తెలిస్తే అవాక్కవుతారు.!

Orissa Girl Collects 5k Match Boxes. సాధారణంగా ప్రతి ఒక్కరికి కొన్ని అలవాట్లు ఉంటాయి. వారికి ఇష్టమైన

By Medi Samrat  Published on  21 Dec 2020 9:37 AM GMT
ఈ పాప అలవాటు తెలిస్తే అవాక్కవుతారు.!

సాధారణంగా ప్రతి ఒక్కరికి కొన్ని అలవాట్లు ఉంటాయి. వారికి ఇష్టమైన వాటిని ఎక్కడి నుంచి అయినా సరే తెప్పించుకొని వాటిని భద్రపరుస్తూ ఉండడం అలవాటుగా మారిపోయింది. కొందరు పెన్నులను కలెక్ట్ చేస్తుంటారు. మరికొందరు తమ అభిమాన నటుల ఫోటోలను ఇలా ఎవరికి నచ్చినవి వారు వాటిని సేకరించి భద్రపరచడం అలవాటుగా ఉంటుంది. ఈ తరహాలోనే ఓ చిన్నారి అయిపోయిన అగ్గిపెట్టెను భద్రపరచడం తన అలవాటుగా ఉండటంతో ఈ పాప ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సాధారణంగా మనం అగ్గిపుల్లలు అయిపోగానే అగ్గిపెట్టె పనికిరాదని దాన్ని పడేస్తూ ఉంటాం. కానీ భువనేశ్వర్ కు చెందిన దివ్యాన్షి అనేమూడో తరగతి చదివే విద్యార్థిని అయిపోయిన అగ్గిపెట్టెలను కలెక్ట్ చేయడం తన హాబీగా మార్చుకుంది. ఈ తరహాలోనే దాదాపు అయిపోయిన 5000 అగ్గిపెట్టెను కలెక్ట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలా అగ్గిపెట్టెను కలెక్ట్ చేయడం అలవాటు గా ఉండడంతో ఇతర దేశాల అగ్గిపెట్టెలను కూడా భద్ర పరిచింది.

తన తండ్రి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కావడంతో దేశవిదేశాలు తిరుగుతూ తన స్నేహితులకు అక్కడ దొరికే అగ్గిపెట్టెను తెచ్చేవారు. అయితే అవి కాళీ అయిన తరువాత వాటన్నింటిని జాగ్రత్తగా భద్రపరిచే దానిని దివ్యాన్షి తెలిపారు. అంతే కాకుండా ఎవరైనా బంధువులు లేదా స్నేహితులు ఇతర దేశాలకు వెళ్లినప్పుడు వారు కూడా తనకు అగ్గిపెట్టెలు తెచ్చే వారని తెలిపారు. ఎంతో అందంగా, వివిధ రకాల బొమ్మలతో ఉన్న అగ్గిపెట్టలను భద్రపరచడానికి తన తల్లిదండ్రులు ఎంతో సహాయం చేశారని దివ్యాన్షి అన్నారు.దివ్యాన్షి కలెక్ట్ చేసిన అగ్గిపెట్టెల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Next Story
Share it