పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై 'ఆపరేషన్ సింధూర్' పేరిట వైమానిక దాడులు చేసినట్టు భారత రక్షణ శాఖ ప్రకటించింది. అర్ధరాత్రి 1.44 గంటలకు పాకిస్తాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ప్రాంతాలను గుర్తించి నాశనం చేసినట్టు పేర్కొంది. పాకిస్తాన్‌లోని 4, పీవోకే లోని 5 ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఆర్మీ విరుచుకుపడింది. అటు పాక్ ఆక్రమిత కశ్‌మీర్‌లోని కోట్లి, ముజఫరాబాద్, బహవల్‌పూర్‌లో భారత ఆర్మీ దాడులు చేసిందని పాకిస్తాన్ ఆర్మీ ధ్రువీకరించింది.
దేశంలో ఇవాళ 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహణ బార్డర్‌లో వాయుసేన భారీ విన్యాసాలు చేపట్టాలంటూ మరోవైపు పాక్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ గురించి భారత్ పలు ప్రధాన దేశాలకు వివరించింది. దాడుల అనంతరం అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా దేశాలకు సీనియర్ అధికారులు సమాచారం ఇచ్చారు. పహల్గామ్ టెర్రర్ అటాక్‌కు ప్రతీకారంగా టెర్రరిజాన్ని అంతమొందించాలనే ఈ స్ట్రైక్స్ చేసినట్టు వివరించారు.
పాక్ ప్రజలకు ఎలాంటి హాని జరగలేదని చెప్పారు. అటు భారత్ తమ దేశంలోని ఆరు ప్రాంతాల్లో వైమానిక దాడులు చేసింది పాక్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ తెలిపారు. ఈ దాడుల్లో 8 మంది ప్రజలు మరణించారని, 22 మందికి గాయాలయ్యాయని వెల్లడించారు. అయితే ఈ స్ట్రైక్స్‌లో దాదాపు 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.