మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన సాగర్ జిల్లాలోని రాహత్‌ఘర్ వద్ద జరిగింది. ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది పిల్లలు ఉన్నారు. బస్సులో ఉన్న మిగతా పిల్లలందరూ సురక్షితంగా ఉన్నారని సాగర్ జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్యా తెలిపారు.
బస్సులో ఉన్న విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. స్కూల్ బస్సు డ్రైవర్ బస్సు నడుపుతూ మొబైల్‌లో మాట్లాడున్న సమయంలో ప్రమాదం జరిగింది. మరోవైపు బస్సు యజమాని, డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలోని అంబర్‌నాథ్‌లో అంబర్‌నాథ్‌లోని రోటరీ పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ప్రైవేట్ మినీ స్కూల్ బస్సు బోల్తా పడింది. ర్యాంప్‌పై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో స్కూల్ బస్సు బోల్తా పడడంతో బస్సు కిందకు పడిపోయింది. అదృష్టవశాత్తూ, స్థానికులు, చుట్టుపక్కల ప్రజలు వేగంగా స్పందించడంతో.. బోల్తా పడిన బస్సు నుండి పిల్లలను రక్షించడంతో పెద్దగా గాయాలు సంభవించలేదు.