ఓమిక్రాన్‌ టెన్షన్.. నేటి రాత్రి నుంచి కర్ఫ్యూ

OmicronTension .. Curfew from tonight in several states. భారత్‌లో కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఓమిక్రాన్‌.. చాప కింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో ఓమిక్రాన్‌ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.

By అంజి  Published on  25 Dec 2021 3:57 PM IST
ఓమిక్రాన్‌ టెన్షన్.. నేటి రాత్రి నుంచి కర్ఫ్యూ

భారత్‌లో కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఓమిక్రాన్‌.. చాప కింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో ఓమిక్రాన్‌ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కాగా కొన్ని రాష్ట్రాలు ఆంక్షల బాట పట్టాయి. కఠిన నిబంధనలు అమలు చేయడానికి పలు రాష్ట్రాలు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయి. ఒడిశా, గుజరాత్‌, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల ప్రభుత్వాలు ఓమిక్రాన్‌ వేరియంట్‌ కట్టడి కోసం పలు నిబంధనలను ప్రకటించింది. కాగా ప్రకటించిన నియమనిబంధనలు ఇవాళ రాత్రి నుండి అమలు కానున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో ఇవాళ రాత్రి నుండి కర్ఫ్యూ అమలు కానున్నంది. రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ కొనసాగనున్నది. అలాగే పెళ్లి వేడుకలు, శుభకార్యాలతో పాటు పలు వేడుకలకు హాజరయ్యే వారి సంఖ్యను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిమితం చేసింది. కేవలం 200 మందిని మాత్రమే అనమతిస్తూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే కరోనా నిబంధనలను తప్పనిసరి చేసింది. మహారాష్ట్రలో కూడా ఓమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఓమిక్రాన్‌కు అడ్డుకట్ట వేసేందుకు పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. మహారాష్ట్రలో కూడా ఇవాళ రాత్రి నుండి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. అలాగే ఎక్కువ మంది గూమిగూడకుండా మహారాష్ట్ర సర్కార్‌ ఆంక్షలు విధించింది. వివాహాలకు 100 మందికి మాత్రమే అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు, జిమ్‌లు, హెటళ్లకు అనుమతి ఇచ్చింది.

గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌, వడోదర, సూరత్‌, రాజ్‌కోట్‌, భావ్‌నగర్‌, జామ్‌నగర్‌, జునాఘడ్‌, గాంధీనగర్‌లో రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు అవుతోంది. ఒడిశా ప్రభుత్వం కూడా ఆంక్షల విధించింది. ఓమిక్రాన్‌ వేరియంట్‌ కట్టడ కోసం న్యూ ఇయర్‌ వేడులకపై ఆంక్షలు విధించింది. న్యూఇయర్‌ వేడుకలను హెటళ్లు, క్లబ్బులు, పార్కుల్లో నిర్వహించొద్దని తెలిపింది. హర్యానా రాష్ట్రంలో కూడా రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్‌ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Next Story