జస్ట్ అలా పెళ్లి చేసుకుంది.. ఇలా ప్రియుడితో..

Old City Bride Elope with Lover. పెళ్లయిన మరుక్షణమే భర్తను వదిలి ప్రియుడితో పారిపోయింది ఓ నవ వధువు.

By Medi Samrat  Published on  18 Sep 2021 9:40 AM GMT
జస్ట్ అలా పెళ్లి చేసుకుంది.. ఇలా ప్రియుడితో..

పెళ్లయిన మరుక్షణమే భర్తను వదిలి ప్రియుడితో పారిపోయింది ఓ నవ వధువు. పెళ్లి సందర్భంగా వరుడు వధువుకి కొంత డబ్బు, బంగారం ఇచ్చాడు. అవి చేతికందగానే తాళి కట్టిన భర్త కళ్లు గప్పి ప్రియుడితో పారిపోయింది. బెంగళూరుకు చెందిన మహమ్మద్‌ ఇలియాస్‌ – హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన సమ్రిన్‌ బేగంకి పెళ్లి నిశ్చయించారు పెద్దలు. సెప్టెంబర్‌ 18న హైదరాబాద్‌ బాలాపూర్‌లోని ఓ ఇంట్లో పెళ్లి జరిగింది. వివాహానికి ముందే ఇలియాస్‌, సమ్రిన్‌ బేగంకి రెండు లక్షల విలువైన బంగారం, 50 వేల రూపాయలు క్యాష్‌ మెహర్ (గిఫ్ట్‌)గా ఇచ్చాడు.

పెళ్లి తంతు ముగిశాక.. పెళ్లికూతురు మేనత్త, చిన్నమ్మ వచ్చి సమ్రిన్‌ను పార్లర్‌కు తీసుకువెళ్తున్నామని చెప్పి బయటకు తీసుకెళ్లారు. మళ్లీ తిరిగి రాలేదు. పార్లర్‌కు వెళ్తున్నామని చెప్పి తీసుకెళ్లిన సమ్రిన్‌ను, ఆమె ప్రియుడి వెంట పంపించేశారు. పెళ్లికొడుకు ఇచ్చిన నగదు, బంగారం తీసుకొని ఆమె ప్రియుడితో వెళ్ళిపోయింది. ఎంతసేపటికి సమ్రిన్‌ బేగం తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన మహమ్మద్‌ ఇలియాస్‌ ఆమె మేనమామలను నిలదీయగా నిజం తెలిసింది. మోసపోయానని గ్రహించిన ఇలియాస్‌ తనకు ఆమె భార్యగా వద్దని లేల్చి చెప్పాడు. తాను ఇచ్చిన డబ్బు, బంగారం తిరిగి ఇవ్వకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సమ్రిన్‌ మేనమామలను హెచ్చరించాడు. కొంత గడువు ఇమ్మని కుటుంబ సభ్యులు చెప్పడంతో ఇలియాస్ సైలెంట్ అయ్యాడు.


Next Story
Share it