బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియకు అధికారిక ప్రకటన

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2024–25 సంఘటన పర్వంలో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది

By -  Knakam Karthik
Published on : 16 Jan 2026 12:27 PM IST

National News, Delhi, Bjp, National Presidential Election Process

బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియకు అధికారిక ప్రకటన

ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2024–25 సంఘటన పర్వంలో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను బీజేపీ జాతీయ రిటర్నింగ్ ఆఫీసర్, రాజ్యసభ సభ్యులు డా. కె. లక్ష్మణ్ 2026 జనవరి 16న విడుదల చేశారు .

నోటిఫికేషన్ ప్రకారం, జనవరి 16, 2026 (శుక్రవారం) మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల మండలి (Electoral College) జాబితాను విడుదల చేయనున్నారు. అనంతరం జనవరి 19, 2026 (సోమవారం) నామినేషన్ ప్రక్రియ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు నామినేషన్ పత్రాల పరిశీలన, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు నిర్ణయించారు. అదే రోజు సాయంత్రం 6:30 గంటలకు బీజేపీ జాతీయ ఎన్నికల అధికారి ప్రెస్ నోటు విడుదల చేయనున్నారు.

అవసరమైతే జనవరి 20, 2026 (మంగళవారం) ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఓటింగ్ నిర్వహించి, అనంతరం అధికారిక ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ మొత్తం ప్రక్రియ న్యూఢిల్లీ లోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్, కేంద్ర కార్యాలయంలో జరుగుతుందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి సంబంధించిన ఈ ఎన్నికల ప్రక్రియపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Next Story