ఆదివారం ఝార్సుగూడ జిల్లాలోని బ్రజరాజ్‌నగర్ లో అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ కాల్పులు జరపడంతో ఆసుపత్రి పాలైన ఒడిశా ఆరోగ్య మంత్రి నబా కిషోర్ దాస్, చికిత్స పొందుతూ మరణించారు. అపోలో ఆసుపత్రి నివేదిక ప్రకారం.. ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా ఆయన మరణించారని రెలిపారు. ICU లో ఆయన ప్రాణాలు నిలబెట్టాలని వైద్యులు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఒక బుల్లెట్ కారణంగా గుండె, ఎడమ ఊపిరితిత్తులకు నష్టం వాటిల్లిందని, అంతర్గతంగా రక్తస్రావం ఎక్కువగా ఉండడంతో ప్రాణాలు కాపాడలేకపోయామని వైద్యులు తెలిపారు.
ఆరోగ్య మంత్రి నబా కిసోర్ దాస్‌పై ఆదివారం ఝార్సుగూడ జిల్లాలోని బ్రజరాజ్‌నగర్ సమీపంలోని గాంధీచౌక్ సమీపంలో అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ గోపాల్ దాస్ కాల్పులు జరిపారు. ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతుండగా కాల్పులు జరపడంతో ఛాతీలోకి బుల్లెట్లు దూసుకువెళ్లాయి. రెండు రౌండ్లు కాల్చడంతో మంత్రికి తీవ్రగాయాలయ్యాయి, ఆయనను ఆసుపత్రికి తరలించారు. బ్రజ్ రాజ్ నగర్ పట్టణంలో ఆదివారం ఉదయం ఓ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన మంత్రి కారు దిగుతున్న సమయంలో సమీపం నుంచి అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ ఐదారు రౌండ్ల కాల్పులు జరిపాడు.