ఒడిశా ప్రథమ మహిళ, గవర్నర్ గణేశీ లాల్ సతీమణి సుశీలాదేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు.
కాగా, గవర్నర్ గణేశీలాల్, ఆయన సతీమణి సుశీలా దేవీ ఈనెల ఆరంభంలో కరోనా బారినపడ్డారు. వారితోపాటు మిగిలిన కుటుంబ సభ్యులు కూడా ఈనెల 4న ఆసుపత్రిలో చికిత్స పొందారు. వారితోపాటు రాజ్‌భవన్‌లోని ఇద్దరు డాక్టర్లకు కూడా కరోనా వైరస్ సోకింది. గవర్నర్ గణేశీలాల్ సతీమణి మృతిపట్ల సీఎం నవీన్ పట్నాయక్ సంతాపం ప్రకటించారు. గవర్నర్‌కు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.