ఆగస్టు 15 హాలిడే లేదు
NO holiday on August 15 in THIS state. ఉత్తరప్రదేశ్ లోని అధికార బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 17 July 2022 10:15 PM ISTఉత్తరప్రదేశ్ లోని అధికార బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు, కార్యాలయాలు, సంస్థలకు సెలవు రద్దు చేస్తున్నట్లు యోగి సర్కార్ ప్రకటించింది. ఆ రోజున ప్రతి ఒక్కరూ విద్యార్థులు విద్యాసంస్థల్లో, అధికారులు విధుల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్ పేరుతో 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఎప్పటిలాగే జెండా వందనం చేసి వెళ్లిపోవడం కాకుండా.. ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతోనే సెలవు రద్దు చేసినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రకటించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నందున ప్రతి జిల్లాలో ఈ ఏడాది ప్రత్యేక కార్యక్రమంగా ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
యూపీలో స్వచ్చ భారత్‌లో భాగంగా స్వాతంత్ర్య పోరాట యోధులకు సంబంధించిన ప్రదేశాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఎన్‌సీసీ, స్కౌట్ విద్యార్ధులతో పాటు స్వచ్ఛంద సంస్థలను, వ్యాపార సంస్థలను కూడా ఇందులో పాల్గొనేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.