భారతదేశంలో హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) కేసులు ఏవీ నమోదవ్వలేదని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) తెలిపింది. ఆరోగ్య సంస్థ డైరెక్టర్ డాక్టర్ అతుల్ గోయల్ మాట్లాడుతూ హెచ్‌ఎంపీవీ ఇతర శ్వాసకోశ వైరస్‌ల లాంటిదని, ఇది సాధారణ జలుబుకు కారణమవుతుంది. వైరస్ కారణంగా పిల్లలు, వృద్ధులు ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి. శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల కోసం సాధారణ జాగ్రత్తలు పాటించాలని, మీకు దగ్గు లేదా జలుబు ఉంటే, ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఇతరులతో సన్నిహితంగా ఉండకూడదని ఆయన ప్రజలకు సూచించారు.
జలుబు లేదా జ్వరానికి సాధారణ మందులు తీసుకుంటే సరిపోతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదని అతుల్ గోయల్ హామీ ఇచ్చారు. డిసెంబర్‌లో దేశంలో శ్వాసకోశ వ్యాప్తి సంఖ్య గణనీయంగా పెరగలేదని తెలిపారు.