దేశంలో వాక్ స్వాతంత్య్రం లేకుండా పోయింది : ఖర్గే
No freedom of speech after BJP. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో వాక్ స్వాతంత్య్రం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు
By Medi Samrat
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో వాక్ స్వాతంత్య్రం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం అన్నారు. జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ఖర్గే,.. ఈ వారం ప్రారంభంలో పార్లమెంటులో తన ప్రసంగంలోని కొన్ని భాగాలను తొలగించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్ లోపలా, బయటా వాక్ స్వాతంత్య్రం లేదని.. మాట్లాడే ధైర్యం ఉన్న వారిని కటకటాల వెనక్కి నెట్టారని మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు.
झारखण्ड के साहेबगंज जिले के श्रीकुंड उच्च विद्यालय, गुमानी से @INCIndia के राष्ट्रीय अध्यक्ष माननीय @kharge जी ने आज "हाथ से हाथ जोड़ो" कार्यक्रम का शुभारम्भ किया। इस अवसर पर मैं आदरणीय @RahulGandhi जी के सपनों को साकार करने के लिए इस कार्यक्रम को भी सफल बनाने का आह्वान की। pic.twitter.com/u9M5YuXvtf
— Geeta kora (@Geetakora1) February 11, 2023
2014లో ద్రవ్యోల్బణం తగ్గిస్తామన్న హామీతో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు, పేదరికం పెరిగిపోయాయని అన్నారు. దేశంలో మౌలిక వసతులను అభివృద్ధి చేసి స్వాతంత్య్రం కోసం పోరాడింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. జార్ఖండ్‌లోని పాకూర్‌లోని గుమాని గ్రౌండ్‌లో కాంగ్రెస్ 60 రోజుల "హాత్ సే హాత్ జోడో" కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యకర్తలు కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇంటింటికీ తిరుగుతారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అవినాష్ పాండే, జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ ఠాకూర్, రాష్ట్ర మంత్రి అలంగీర్ ఆలం పాల్గొన్నారు.