వ్యాక్సిన్లు వేసుకోని వారు బస్సుల్లో ప్రయాణం చేయడానికి కూడా వీలు లేదు

No COVID-19 Vaccine Jab, No Bus Travel In Civic Buses. వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా మహమ్మారిని ధీటుగా ఎదుర్కోవచ్చని వైద్య, ఆరోగ్య నిపుణులు

By Medi Samrat  Published on  13 Nov 2021 12:25 PM GMT
వ్యాక్సిన్లు వేసుకోని వారు బస్సుల్లో ప్రయాణం చేయడానికి కూడా వీలు లేదు

వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా మహమ్మారిని ధీటుగా ఎదుర్కోవచ్చని వైద్య, ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉన్నారు. అయినా కూడా కొందరు వ్యాక్సిన్ వేసుకోడానికి నిరాకరిస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సిన్లను వేసుకునే విధంగా బహుమానాలను ప్రచురిస్తూ ఉండగా.. ఇంకొన్ని చోట్ల వ్యాక్సిన్లను వేసుకోని వారిపై కఠిన ఆంక్షలను కూడా విధిస్తూ ఉన్నారు. కోవిడ్ 19 వ్యాక్సిన్‌ల ఒక్క డోస్ కూడా తీసుకోని వ్యక్తులు థానే మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహించే బస్సులలో ప్రయాణించడానికి అనుమతించబడరని నగర మేయర్ నరేష్ మ్హాస్కే శనివారం తెలిపారు. వ్యాక్సిన్‌లో ఒక్క డోస్ కూడా తీసుకోని తమ ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లించబోమని థానే పౌర సంఘం ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ఈ ప్రకటన వచ్చింది.

"నవంబర్ చివరి నాటికి వంద శాతం టీకా లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో, వివిధ చర్యలను అవలంబించడం చాలా అవసరం," అని నరేష్ పేర్కొన్నట్లు ఒక ప్రకటన బయటకు వచ్చింది. టీకాలు వేసిన పౌరుల ఇంటింటికీ సర్వేను టీఎంసీ ప్రారంభించింది. "ఎవరైనా టీకాలు వేయలేదని తేలితే, పౌర సంఘం వారికి వెంటనే వారి కేంద్రాలలో టీకాలు వేస్తారు. బస్సులలో ప్రయాణించేవారు టీకాలు వేసుకున్నట్లు రుజువులు లేదా యూనివర్సల్ ట్రావెల్ పాస్‌ను తమ వెంట తీసుకెళ్లాలి, లేకుంటే వారిని ఈ బస్సుల్లో ఎక్కడానికి అనుమతించబడరు, "అని ప్రకటన తెలిపింది. శుక్రవారం వరకు థానే జిల్లాలో 86,00,118 మందికి టీకాలు వేశారు. TMC అందించిన లెక్కల ప్రకారం వారిలో మొత్తం 56,00,856 మంది మొదటి డోస్ ను పొందారు మరియు 29,99,262 మంది రెండవ డోస్ ను స్వీకరించారు.


Next Story