బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దర్భంగాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాదాలను తాకేందుకు ప్రయత్నించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. 73 ఏళ్ల నితీష్ కుమార్ ఈ సంవత్సరం మోదీ కాళ్లను ముక్కలని అనుకోవడం ఇది మూడో సారి. 74 ఏళ్ల ప్రధాని మోదీ వైపు నడుస్తూ వెళ్లిన నితీష్ కుమార్ ఆయన పాదాలను తాకడానికి నమస్కరించారు.
ఈ పరిణామంతో ఆశ్చర్య పోయిన మోదీ నితీష్ పాదాలను తాకకుండా ఆపారు. కరచాలనం చేస్తూ కనిపించారు. పార్టీ కార్యకర్తలు ప్రధానికి పూలమాల వేస్తుండగా నితీష్ కుమార్‌ను మోదీ తన వైపుకు లాగుతూ కనిపించారు. అయితే నితీష్ కుమార్ ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. జూన్‌లో నితీష్ కుమార్ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో మోదీ పాదాలను తాకేందుకు ప్రయత్నించినప్పుడు అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నవాడాలో జరిగిన లోక్‌సభ ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రధాని మోదీ పాదాలను తాకారు.
నితీష్ కుమార్ JD(U) లోక్‌సభ ఎన్నికలలో BJPకి రెండవ అతిపెద్ద మిత్రపక్షంగా ఆవిర్భవించింది. వరుసగా మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సహాయపడింది. బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమవ్వగా.. మెజారిటీ మార్కును దాటడానికి జెడి(యు), టీడీపీపై బీజేపీ ఆధారపడింది.