బీజేపీలో చేరిన ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు..!
Nitish Kumar Loses 6 Arunachal MLAs To BJP In Fresh Embarrassment. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు సొంత పార్టీ
By Medi Samrat Published on 25 Dec 2020 6:36 PM ISTబీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు సొంత పార్టీ ఎమ్మెల్యేలు షాకిచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ ఆరుగురు ఎమ్మెల్యేలు జేడీయూకి గుడ్ బై చెప్పి... బీజేపీలో చేరారు. ఈ ఆరుగురిలో ముగ్గురిని నెలకిందే జేడీయూ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వీరిపై చర్యలు తీసుకుంది. బీజేపీకి జేడీయూ మిత్రపక్షంగా ఉంది. బీజేపీ మద్దతుతోనే బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కొనసాగుతున్నారు.
అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు బియురాం వాంఘే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు అభివృద్ధి వైపు నిలిచారని చెప్పారు. ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి పెమాఖండు నాయకత్వంపై నమ్మకముంచారని తెలిపారు. జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి మాట్లాడుతూ, తమ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరినా తాము ఆ పార్టీకి మద్దతిస్తామని చెప్పారు. బీజేపీతో తాము స్నేహపూర్వక ప్రతిపక్షంగానే కొనసాగుతామని అన్నారు.
భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను దేశ వ్యాప్తంగా మొదలు పెట్టింది, ఇప్పటికే ఎన్నో రాష్ట్రాల్లో ఎంతో మంది నాయకులను తమ వైపు తిప్పుకోవడంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. కొంచెం అవకాశం ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను మొదలు పెడుతూ ఉంది. ప్రాంతీయ పార్టీలలో అసంతృప్తులు ఉన్నా.. రెబల్స్ ఉన్నా కూడా బీజేపీ వారి మీద దృష్టి సారిస్తూ ఉంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఇలా ఎమ్మెల్యేలు, ఎంపీలను తమ వశం చేసేసుకుంది బీజేపీ. ఇంకా ఎన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు నేతలు షాక్ ఇచ్చి.. బీజేపీలో చేరుతారో అన్నది తెలియాల్సి ఉంది.