సొంత ఊరిలో ముఖ్యమంత్రి మీద దాడి చేసిన యువకుడు
Nitish Kumar Attacked By Man During Function At Hometown. బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై దాడి జరిగింది. ఆయన స్వగ్రామంలోనే ఈ దాడి చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 28 March 2022 9:57 AM ISTబీహార్ సీఎం నితీశ్ కుమార్ పై దాడి జరిగింది. ఆయన స్వగ్రామంలోనే ఈ దాడి చోటు చేసుకుంది. స్వగ్రామం భక్తియార్‌పూర్‌లో భారీ భద్రతా లోపంతో ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. దాడి ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వ్యక్తిని అరెస్టు చేశామని, ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడని వర్గాలు తెలిపాయి. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొంటూ, రాష్ట్ర మంత్రి అశోక్ చౌదరి తెలిపారు. "ముఖ్యమంత్రి భద్రతకు సంబంధించి కొంత లోపం ఉంది. విచారణ జరగాలి" అని అన్నారు. స్థానిక సఫర్ హాస్పిటల్ కాంప్లెక్స్‌లో రాష్ట్రానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు శిల్పాద్ర యాజీ విగ్రహానికి ముఖ్యమంత్రి నివాళులర్పించేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో దాడి జరిగినట్లు సీసీటీవీ కెమెరాల్లోని ఫుటేజీలు చూపించాయి.
Bihar CM Nitish Kumar attacked at home district of bakhtiyarpur. One man came and slapped him from behind. The man was immediately arrested by the cops.@BJP4India @Jduonline @INCIndia @NitishKumar #bihar pic.twitter.com/Nv9SEwZVMa
— KISHOR K SINGH (@singh_ksingh) March 27, 2022
వెనుక నుండి వచ్చిన వ్యక్తి, వేగంగా అడుగులు వేస్తూ వేదికపైకి నడుస్తూ, విగ్రహానికి పుష్పాంజలి ఘటించేందుకు వంగి ఉన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను కొట్టడం కనిపించింది. వెంటనే అతడిని ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది ఈడ్చుకెళ్లారు. "అతడ్ని కొట్టవద్దు. ముందు అతను ఏమి చెబుతున్నాడో తెలుసుకోండి" అని ముఖ్యమంత్రి తన భద్రతా సిబ్బందికి చెప్పినట్లు వర్గాలు తెలిపాయి. ఈ ఘటనతో అక్కడున్న వారందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే భద్రతా సిబ్బంది ముందుకొచ్చి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆ యువకుడు మతిస్థిమితం లేనివాడని భావిస్తున్నారు.
ఇతర వీడియోల ప్రకారం ఆ వ్యక్తిని శంకర్ సాహ్‌గా గుర్తించారు. భక్తియార్‌పూర్‌లోని అబు మహ్మద్ పూర్‌లో నివాసం ఉంటున్న శంకర్‌కు నగల దుకాణం ఉంది. పాట్నా పోలీసుల ప్రాథమిక విచారణలో ఆ వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదని తేలింది. అతని కుటుంబం అతనిని ఎక్కువగా ఇంటికే పరిమితం చేసిందని అన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ చేస్తున్నారు. భద్రతా లోపానికి సంబంధించిన అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.