త్వరలోనే దేశంలో తొలి ఎలక్ట్రిక్ హైవే నిర్మాణం జరగనుంది. దీనికి సంబంధించి కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే ఓ విదేశీ సంస్థతో చర్చలు జరిపినట్లు తెలిసింది. మొదటగా ఢిల్లీ నుండి జైపూర్ వరకు ఎలక్టిక్‌ హైవేని నిర్మించనున్నట్లు కేంద్ర రోడ్డు రవానా, రహదారుల శాఖ మంత్రి నితిన గడ్కరీ చెప్పారు. దౌసాలో ఢిల్లీ - ముంబై ఎక్స్‌ప్రెస్ హైవే పనుల పురగోతిని పరిశీలిస్తూ ఆయన ఈ ప్రకటన చేశారు. '' ఢిల్లీ నుండి జైపూర్‌ వరకు ఎలక్ట్రిక్ హైవే నిర్మించాలనేది నా కల అని, ఇది ఇప్పటికే ప్రతిపాదించబడిన ప్రాజెక్టు'' అని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. దీనిపై ఓ విదేశీ సంస్థతో చర్చిస్తున్నామని, తర్వలోనే నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఎలక్ట్రిక్ రైల్వే ఇంజిన్‌ల మాదిరిగానే... బస్సులు, ట్రక్కులు కరెంట్ ద్వారా నడుస్తాయన్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని నితిన్ గడ్కరీ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో దేశంలో 22 ఎక్స్‌ప్రెస్‌ హైవేలు నిర్మిస్తామని.. వీటిలో ఇప్పటికే 7 ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణ పనులు పట్టాలెక్కయన్నారు.

అలాగే మొక్కజొన్న, గోధుమ, బియ్యం, బజ్రా నుండి ఇథనాల్ ఉత్పత్తి చేసి... పెట్రోల్ స్థానంలో ఇథనాల్‌ను భర్తీ చేయవచ్చనారు. ఇందుకు స్కూటర్లు, బైక్‌లు పెట్రోల్‌తో నడపకుండా ఉండేలా చట్టాన్ని కూడా తీసుకువస్తామన్నారు. లీటర్‌ పెట్రోల్‌ను రూ.110కి కొనుగోలు చేసే బదులు రూ.65 లతో ఇథనాల్‌ కొనుగోలు చేయవచ్చని.. ఇది వాయు కాలుష్యాన్ని మరింత తగ్గిస్తుందని నితీన్ గడ్కరీ అన్నారు. ఢిల్లీ - ముంబై ఎక్స్‌ప్రెస్‌ హైవేని పరిశీలించిన నితిన్‌ గడ్కరీ... ప్రాజెక్టు పూర్తైన తర్వాత ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఎక్స్‌ప్రెస్‌ హైవేగా నిలుస్తుందన్నారు. ఈ హైవేతో ఢిల్లీ నుంచి ముంబై మధ్య 24 గంటలుగా ఉన్న ప్రయాణ సమయం 12 గంటలకు తగ్గుతుందన్నారు.


అంజి

Next Story