అప్పుడు బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారు : నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూపీఏ హయాంలో బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయంలో ఆ పార్టీ నేతలు చెప్పిన వారికే రుణాలు ఇవ్వాలని బ్యాంకు సిబ్బందికి ఫోన్లు చేసి వేధించేవారని ఆరోపణలు గుప్పించారు.

By Medi Samrat  Published on  12 Dec 2024 8:15 AM IST
అప్పుడు బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారు : నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూపీఏ హయాంలో బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయంలో ఆ పార్టీ నేతలు చెప్పిన వారికే రుణాలు ఇవ్వాలని బ్యాంకు సిబ్బందికి ఫోన్లు చేసి వేధించేవారని ఆరోపణలు గుప్పించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భారత ప్రభుత్వ రంగ బ్యాంకులపై నిరాధారమైన ప్రకటనలు చేస్తున్నారని నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో​ కష్టపడి పనిచేసే ఉద్యోగులపై అసత్య ప్రచారం చేయడం రాహుల్ గాంధీ మానుకోవాలని, బ్యాంకింగ్‌ సెక్టార్‌పై కనీస అవగాహన పెంచుకోవాలని సూచించారు. యూపీఏ హయాంలోనే బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారని, ప్రభుత్వ రంగ బ్యాంకులను కాంగ్రెస్ హయాంలో తమ బంధుమిత్రులు, చీకటి వ్యాపారుల కోసం ఏటీఎంలా ఉపయోగించారన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో పలు సంస్కరణలు అమలు చేశామన్నారు నిర్మలా సీతారామన్. బ్యాంకులు, ప్రత్యేకంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు గణనీయమైన పురోగతి సాధించాయని నిర్మలా సీతారామన్ వివరించారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు నిర్మలా సీతారామన్. ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం తమ మోసపూరిత మిత్రులకు అపరిమిత వనరుగా ఉపయోగిస్తోందని లోక్‌సభలో రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను నిర్మలా సీతారామన్‌ తప్పుబట్టారు.

Next Story