రాత్రి సమయంలో కర్ఫ్యూ.. అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్
Night Curfew In Karnataka. బ్రిటన్‌లో కొత్త రకం కరోనా గురించి ప్రపంచం మొత్తం ఎంతో టెన్షన్ పడుతూ ఉంది. ప్రపంచ దేశాలు
By Medi Samrat Published on 23 Dec 2020 4:11 PM IST
బ్రిటన్‌లో కొత్త రకం కరోనా గురించి ప్రపంచం మొత్తం ఎంతో టెన్షన్ పడుతూ ఉంది. ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. క్రిస్మస్ సెలవుల దగ్గర నుండి, డిసెంబర్ 31, నూతన సంవత్సరం వేడుకలపై ఆంక్షలు విధించారు అధికారులు. బ్రిటన్ నుంచి రాకపోకలను నిషేధిస్తూ పలు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. భారత్ కూడా బుధవారం నుంచి డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు యూకే నుంచి అన్ని విమానాల రాకపోకలపై నిషేధం విధించింది.
కొత్త రకం కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం రాత్రి 10 గంటల నుంచి అమలులోకి రానున్న కర్ఫ్యూ నిబంధనలు ఉదయం 6 గంటల వరకూ కొనసాగుతాయి. జనవరి 2వ తేదీ వరకూ ఈ కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
కొత్త కరోనా వైరస్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కరోనా కొత్త వైరస్‌పై అమ్రమత్తంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా తమ వివరాలని వైద్య ఆరోగ్యశాఖ వెబ్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని, లేకపోతే వారిని రాష్ట్రంలోకి అనుమతించమని స్పష్టం చేశారు. ఏపీకి వచ్చే ప్రయాణికులపై పూర్తి స్థాయిలో మోనిటరింగ్ ఉందని, ఇప్పటికే యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాలు సేకరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 21 వేల బృందాలు క్షేత్రస్ధాయిలో పనిచేస్తున్నాయని వెల్లడించారు.