8 జిల్లాల్లో మళ్లీ మూతపడిన పాఠశాలలు.. లాక్‌డౌన్‌ అమలు

Night curfew in 8 districts of Punjab, all schools closed. దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా

By Medi Samrat  Published on  13 March 2021 5:53 AM GMT
8 జిల్లాల్లో మళ్లీ మూతపడిన పాఠశాలలు.. లాక్‌డౌన్‌ అమలు
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా ఇంకా పాజిటివ్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే మహారాష్ట్రతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఇక తాజాగా పంజాబ్‌లో కూడా కరోనా విజృంభిస్తోంది. పంజాబ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగిపోతున్న దృష్ట్యా ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో 8 జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధించడంతో పాటు పాఠశాలలు సైతం మూసివేశారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి నుంచి మరో నాలుగు జిల్లాల్లో రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించారు. లుధియానా, పటియాలా, మొహలీ, ఫతేగఢ్‌, సాహిబ్‌, జలంధర్‌, నవాంశహర్‌, కప్తూర్తలాలలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ విధించారు.


రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేశారు.ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి విజయ్‌ సింగాల్‌ మాట్లాడుతూ.. విద్యార్థులకు తిరిగి ఆన్‌లైన్‌లో తరగతులు ప్రారంభించనున్నామని, ఉపాధ్యాయులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలకు హాజరవుతున్నారు. ఈ ఏడాది ఆన్‌లైన్‌ విధానంలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా, మహారాష్ట్రలో కూడా కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. అలాగే మాస్క్‌లు ధరించని వారికి భారీగా జరిమానాలు విధిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కోవిడ్‌ నిబంధనలు పాటించని వారిపై చర్యలు చేపడుతున్నారు అధికారులు.


Next Story