అమరావతి నుంచి అకోలా మధ్య హైవే నిర్మాణం.. అతి తక్కువ సమయంలో..

NHAI aims Guinness World Record to build a highway in 108 hrs. నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI) అతి తక్కువ సమయంలో

By Medi Samrat  Published on  8 Jun 2022 10:18 AM GMT
అమరావతి నుంచి అకోలా మధ్య హైవే నిర్మాణం.. అతి తక్కువ సమయంలో..

నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI) అతి తక్కువ సమయంలో 75 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మించి గిన్నిస్ వరల్డ్ రికార్డు లో భారత్ పేరును లిఖించింది. ఈ జాతీయ రహదారి నిర్మాణం ఐదు రోజుల్లోనే పూర్తయింది. అంతకుముందు ఖతార్‌ పేరిట ఉన్న రికార్డును భారత్ బద్దలు కొట్టింది. ఈ రికార్డుకు సంబంధించిన వివరాలను కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. గిన్నిస్‌ రికార్డ్‌ సర్టిఫికెట్‌తో పాటు రోడ్డు నిర్మాణ ఫొటోలను ఆయన షేర్‌ చేశారు.

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అమరావతి – అకోలా మధ్య 75 కిలోమీటర్ల (కిమీ) పొడవైన రహదారిని నిర్మించింది. అతి తక్కువ సమయంలో 105 గంటల 33 నిమిషాలలో రహదారిని పూర్తి చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కైవసం చేసుకుంది. ఎన్‌హెచ్‌ఏఐకి చెందిన 800 మంది ఉద్యోగులు, ఇండిపెండెంట్ కన్సల్టెంట్‌లతో సహా ప్రైవేట్ కంపెనీకి చెందిన 720 మంది కార్మికులు ఈ పనులను రికార్డు సమయంలో పూర్తి చేశారు. జూన్ 3వ తేదీ ఉదయం ఏడు గంటల ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కాగా జూన్ 7 సాయంత్రం 5 గంటలకు పూర్తి చేశారు.











Next Story