మాజీ సీఎం వ్యాఖ్య‌లు.. ఎంవీఏ కూటమిలో 'కొత్త వివాదం'

మహారాష్ట్ర ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. అన్ని పార్టీలు తమ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్ర‌చారం చేస్తున్నాయి. ఎన్నికల తర్వాత సీఎంను ప్రకటిస్తామని మహాయుతి చెబుతుండగా.. ముఖ్య‌మంత్రి పదవి విషయంలో ఎంవీఏలో చీలిక వచ్చినట్లు తెలుస్తోంది.

By Kalasani Durgapraveen  Published on  14 Nov 2024 11:53 AM IST
మాజీ సీఎం వ్యాఖ్య‌లు.. ఎంవీఏ కూటమిలో కొత్త వివాదం

మహారాష్ట్ర ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. అన్ని పార్టీలు తమ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్ర‌చారం చేస్తున్నాయి. ఎన్నికల తర్వాత సీఎంను ప్రకటిస్తామని మహాయుతి చెబుతుండగా.. ముఖ్య‌మంత్రి పదవి విషయంలో ఎంవీఏలో చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సీఎం పదవిపై కన్నేసింద‌న్న వాదనతో కూటమిలో కొత్త వివాదం మొదలైంది.

ఎన్నికల ప్రకటనకు ముందు ఉద్ధవ్ ఠాక్రే సీఎం అభ్య‌ర్థిని ప్రకటించాలని డిమాండ్ చేశారు.అయితే శరద్ పవార్, కాంగ్రెస్ నిరాకరించి ఉద్ధవ్‌కు షాక్ ఇచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ డిమాండ్‌తో కొత్త వివాదం తలెత్తనుంది.

మహావికాస్‌ అఘాడి(ఎంవీఏ) ఎన్నికల్లో గెలిస్తే సీఎం కాంగ్రెస్‌ వారేనని మాజీ సీఎం, కాంగ్రెస్‌ నేత పృథ్వీరాజ్‌ చవాన్‌ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌తో కూట‌మిలో చీలిక వ‌చ్చిందా అనుమానాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎకనామిక్స్ టైమ్స్‌తో మాట్లాడిన ఆయన.. తనను ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నేత సంప్రదించి బీజేపీలో చేరమని ఆఫర్ చేశారని.. అయితే అందుకు నిరాకరించి తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని.. తన పార్టీ అభ్య‌ర్థి సీఎం అవుతుతార‌ని చెప్పిన‌ట్లు వెల్ల‌డించారు. బీజేపీపై కూడా మాజీ సీఎం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ఇప్పుడు హోర్డింగ్‌ల ద్వారా ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తోందని, తప్పుడు వాగ్దానాలు చేస్తోందని అన్నారు. గత ప్రభుత్వంలో బీజేపీ చేసిందేమీ లేదని, క్షేత్రస్థాయిలో ఏ పనీ కనిపించడం లేదన్నారు.

Next Story