ఢిల్లీలో నైట్‌ కర్ఫ్యూ.. న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లేవ్‌..!

New Year Celebrations Ban In Delhi. క‌రోనా కొత్త రూపు దాల్చి విస్తృత‌మ‌వుత‌న్న‌‌ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో

By Medi Samrat
Published on : 31 Dec 2020 10:07 AM IST

ఢిల్లీలో నైట్‌ కర్ఫ్యూ.. న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లేవ్‌..!

క‌రోనా కొత్త రూపు దాల్చి విస్తృత‌మ‌వుత‌న్న‌‌ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కేజ్రీవాల్ ప్ర‌భుత్వం నైట్‌ కర్ఫ్యూ ప్రకటించింది. డిసెంబ‌ర్ 31వ తేదీ గురువారం రాత్రి నుంచి జ‌న‌వ‌రి 1వ తేదీ శుక్రవారం ఉదయం 6 గంటల వరకు.. అలాగే జనవరి ఒకటిన రాత్రి 11 నుంచి జనవరి 2వ తేదీ ఉదయం వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. ఈ కర్ఫ్యూ కాలంలో ఎటువంటి బహిరంగ సమావేశాలకు, పార్టీల‌కు అనుమతి లేదని స్పష్టం చేసింది.

ఇదిలావుంటే.. దేశవ్యాప్తంగా కొత్తగా బ్రిటన్‌ వైరస్‌ కేసులు నమోదైన నేపథ్యంలో.. నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని కేంద్రం బుధవారం రాష్ట్రాలను కోరింది. కరోనావైరస్ కొత్త ఉత్పరివర్తన పరిస్థితిని ఎదుర్కొనేందుకు నగరం సిద్ధంగా ఉందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రకటించారు.

ఇక‌ యూకే నుంచి వచ్చిన వ్యక్తుల్లో నలుగురికి కొత్త వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. నాలుగు ప్రైవేట్ హాస్పిటళ్లలో ఐసోలేషన్ సదుపాయాలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యగా రద్దీని అరికట్టేందుకు నూతన సంవత్సర వేడుకలపై కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలను కోరింది.


Next Story