కీలక ప్రకటన చేసిన ఎస్‌బీఐ
New SBI Pension Seva portal. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పింఛనుదారులకు తీపికబురు చెప్పింది. ఇకపై పింఛనుదారులు
By Medi Samrat Published on 23 Sept 2021 7:45 PM ISTస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పింఛనుదారులకు తీపికబురు చెప్పింది. ఇకపై పింఛనుదారులు ఏ ఎస్‌బీఐ శాఖలోనైనా 'లైఫ్ సర్టిఫికెట్'ను సమర్పించే వెసులుబాటును కల్పించింది. పింఛనుదారులకు ఉద్దేశించిన పెన్షన్ సేవా పోర్టల్ పునరుద్ధరణలో భాగంగా ఈ సౌకర్యాన్ని తీసుకువచ్చింది. పింఛనుకు సంబంధించిన వివరాలను తేలికగా పొందే వెసులుబాటు కల్పించినట్లు బ్యాంకు తెలిపింది. ఈ మేరకు ఎస్‌బీఐ ఓ ట్వీట్ చేసింది. పింఛను సేవా వెబ్ సైట్‌ను పునరుద్ధరించామని, పింఛనుకు సంబంధించిన అన్ని సేవలను మరింత సులభతరం చేశామని ట్వీట్ లో వెల్లడించింది.పింఛనుదారులు ఈ కొత్త పోర్టల్ ద్వారా ఇక పింఛను స్లిప్పులను తేలికగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని.. ఫామ్ 16 ను కూడా పోర్టల్ నుండి తేలికగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
ఇక ఇటీవలే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లను అలర్ట్ చేసింది. మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని లేదంటే మోసపోవాల్సి వస్తుందని ఎస్‌బీఐ తెలిపింది. ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో బ్యాంక్ ఈ మేరకు కస్టమర్లకు అలర్ట్ చేస్తోంది. ఫేక్ కస్టమర్ కేర్ నెంబర్లతో అప్రమత్తంగా ఉండాలని కోరుతోంది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్ల వివరాలు తెలుసుకోవాలని ఎస్‌బీఐ సూచించింది. అంతేకానీ ఇతర వెబ్‌సైట్ల ద్వారా కస్టమర్ కేర్ నెంబర్లను పొందవద్దని సూచించింది.